Homeఎంటర్టైన్మెంట్Samantha Viral Pics: సమంత లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే మతిపోవాల్సిందే... ఇదేం తెగింపు బాబోయ్!...

Samantha Viral Pics: సమంత లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే మతిపోవాల్సిందే… ఇదేం తెగింపు బాబోయ్! వైరల్ ఫోటోలు

Samantha Viral Pics: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తన హెల్త్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గత ఏడాది వచ్చిన ఖుషి తర్వాత సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్దమవుతుంది.ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ – సమంత జంటగా నటించారు. వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

బిజినెస్ లో కూడా ఆమె దూకుడు చూపిస్తుంది. ఇటీవల సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమాలు చేయకపోయినా బ్రాండ్స్ ప్రమోషన్స్, బిజినెస్, ఫోటో షూట్స్, మ్యాగజైన్ పేజీలపై దర్శనమిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఆ విధంగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఆన్లైన్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది.

సోషల్ మీడియా వేదికగా హెల్త్ టిప్స్ పంచుకుంటుంది సమంత. తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. సమంత లుక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగా సమంతనేనా .. ఇదేదో ఏ ఐ పిక్చర్ లా ఉంది .. మా పాత సమంత మాకు కావలి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు సమంత ఒక ఇన్స్పిరేషన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘ మనపై మనకున్న ఆత్మవిశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని కొన్ని రోజుల క్రితం గ్రహించాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బయట గాయాల కంటే మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

RELATED ARTICLES

Most Popular