Samantha: పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టిన సమంత పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆమాంతం పెరిగింది. తాజాగా కాయిన్ స్విచ్ కుబెర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సామ్ మారింది. ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీ యాప్‌లకు రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్ హీరోలు దేశంలో ప్రచారకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు సామ్ వారి సరసన చేరింది.

గతంలో ఆర్బన్ కిసాన్, సాకీ వంటి బ్రాండ్స్‌కు సమంత ప్రచారకర్తగా వ్యవహరించింది. మొత్తానికి ఫుల్ స్వింగ్‌లో ఉంది సమంత. హిందీ స్టార్ల సరసన చేరింది. ఇక విడాకుల ముచ్చట అనంతరం అడ్డుఅదుపు లేకుండా దూసుకుపోతోంది. పైగా ఐటమ్ సాంగ్ లతో కూడా వరుసగా రచ్చ చేసేయాలని ఫిక్స్ అయిపొయింది.
Also Read:ఒమిక్రాన్ బయట ఎన్ని గంటలు బతికి ఉంటుందో తెలుసా?
పెళ్లి అయ్యాక సమంత ఇన్నాళ్లూ అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది. ఇప్పుడు సమంత ఒక్కో సినిమాకు 3 కోట్లు వరకు తీసుకుంటుంది. తన కెరీర్ ను ఇలాగే కంటిన్యూ చేస్తానంటుంది.
ఎలాగూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఇక వ్యక్తిగత ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్స్ తో మరో సిరీస్ చేయడానికి రెడీ అవుతుంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఓ సినిమా చేయబోతుంది.

ఈ సినిమాకి సమంతకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సమంత కొత్త లుక్ లో కనిపించబోతుంది. అందుకు సంబంధించిన లుక్ కోసం జిమ్ లో ఆమె తెగ కష్టపడిపోతుందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా తన ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది సామ్.
Also Read: తెలంగాణలో మొదలైన కరోనా కల్లోలం..రోజుకు ఎన్ని కేసులంటే?