Homeఎంటర్టైన్మెంట్Actress Samantha అరుదైన గౌరవం దక్కించుకున్న సమంత...

Actress Samantha అరుదైన గౌరవం దక్కించుకున్న సమంత…

 Actress Samantha: అక్కినేని నాగ చైతన్య సరసన “ఏ మాయ చేసావే” సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయం దక్కించుకున్న ఈ భామ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి సూపర్ హిట్ లు సాధించింది సామ్. అయితే ఆమె ఇటీవల భర్త నాగ చైతన్యతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతూ కెరీర్ పరంగా ఫామ్ లోనే ఉంది సమంత. 

samantha going to attend the goa international film festival as a guest

అయితే ఈ కుందనపు బొమ్మకి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తుంది. గోవాలో జరగబోతున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదని చెప్పాలి. గోవాలో నవంబర్ 20 నుంచి వారం రోజలు పాటు జరగనున్న ఈ వేడుకలకు సామ్ ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాక జంతు ప్రేమికురాలుగా, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సేవలు అందిస్తున్న మంచి మనసున్న మనిషిగా సామంతను చెప్పుకోవచ్చు. 

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె ఎంతో మంది పిల్లలకు అండగా నిలుస్తుంది. వీటన్నింటి వలనే ఈ అరుదైన గౌరవం ఆమెకు దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  అలానే ఆమెతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ టీమ్ కూడా ఆ వేడుకలలో సందడి చేయనున్నారు. వారితో పాటు వివేక్ అగ్ని హోత్రి, నటుడు జాన్ ఎడతతిల్ తదితరులు ప్రారంభోత్సవం రోజున పాల్గొననున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version