
Samantha : టాలీవుడ్ లో ఇప్పుడు సమంత-నాగ చైతన్య విడాకుల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. అఫీషియల్ గా భార్యాభర్తలతోపాటు అక్కినేని కుటుంబం నుంచి ఎవ్వరూ ఈ విషయమై స్పందించలేదు. కానీ.. సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న తీరుతో.. వీరిద్దరి మధ్య దూరం పెరుగుతున్న తీరుపై ఒక నిర్ణయానికి వచ్చేశారు జనం. అయితే.. ఇలాంటి సమయంలో అందాలు ఆరబోస్తూ మరో చర్చకు తెరతీసింది సమంత. హాట్ ఫొటో షూట్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేస్తోంది.
సమంత-చైతూ మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఎప్పుడైతే సమంత తన పేరు నుంచి అక్కినేని ఇంటిపేరును తొలగించిందో.. అప్పుడే అనుమానాలు బలపడ్డాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించగా.. తనకు నచ్చినప్పుడే స్పందిస్తానని దాటవేయడంతో ఏదో జరుగుతోందన్న విషయం స్పష్టమైపోయింది.

మొన్నటికి మొన్న బ్రేకప్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత.. తాజాగా నాగ చైతన్య – సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతూ పోస్టు చేసింది. అయితే.. ఇందులో కేవలం సాయిపల్లవి పేరు మాత్రమే రాసి, గ్రీటింగ్స్ చెప్పడం విశేషం.

దీంతో.. వీళ్లిద్దరి మధ్య దూరం చాలా దూరం వెళ్లిపోయిందని తేలిపోయింది. చివరకు చైతూ పేరును కూడా రాయడానికి సమంత ఇష్టంగా లేనట్టుందని అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం సమంత హైదరాబాద్ లో ఉండట్లేదు. చైతూకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నైలో నివాసం ఉంటోంది. త్వరలో ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉంటూ.. వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసుకోవాలని సమంత ఫిక్స్ అయినట్టు సమాచారం.

నాగార్జున రంగంలోకి దిగి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరూ వినలేదని అంటున్నారు. ఈ చర్చ ఇలా సాగుతుంటే.. సమంత మాత్రం గ్లామర్ షో చేస్తుండడం గమనార్హం. పెళ్లి తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా అందాల ప్రదర్శన చేస్తోంది సామ్. ఇదంతా.. తన ఐడెంటిటీని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు. మరి, ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.