https://oktelugu.com/

Samantha: నాగ చైతన్య పెళ్లి రోజు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సమంత..అక్కినేని అభిమానులకు రక్తం మరిగిపోయే పోస్ట్!

సమంత అప్పుడప్పుడు సందర్భానుసారం కొన్ని స్టోరీస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి ఎవరినో గట్టిగా టార్గెట్ చేసి ఈమె వేసినట్టుగా అనిపిస్తుంటాది. అలా ఈమె 'ఫైట్ ఏ గర్ల్' అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి, అబ్బాయి కుస్తీ చేసుకునే వీడియో ని పెట్టి దాని ద్వారా ఆమె సెటైరికల్ గా నాగ చైతన్య ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 5, 2024 / 12:22 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభిత తో డేటింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో ఒక రూమర్ తెగ సంచలనంగా మారింది. ఈ రూమర్ వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే రావడం గమనార్హం. అయితే అవి రూమర్స్ కాదు, నిజమేనని వీళ్లిద్దరు ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు అందరికీ అర్థమైంది. నిన్న సాయంత్రం వీళ్లిద్దరి వివాహ మహోత్సవం బంధు మిత్రుల సమక్షం లో చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు కనుల పండుగ లాగా ఉన్న వీళ్లిద్దరి ఫోటోలు చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపించింది. అభిమానులు కూడా వీళ్లిద్దరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇప్పటికైనా సరైన సెలక్షన్ చేసుకున్నావని ఆశిస్తున్నాము, ఎలాంటి మనస్పర్థలు లేకుండా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి అని సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే సమంత అప్పుడప్పుడు సందర్భానుసారం కొన్ని స్టోరీస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి ఎవరినో గట్టిగా టార్గెట్ చేసి ఈమె వేసినట్టుగా అనిపిస్తుంటాది. అలా ఈమె ‘ఫైట్ ఏ గర్ల్’ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి, అబ్బాయి కుస్తీ చేసుకునే వీడియో ని పెట్టి దాని ద్వారా ఆమె సెటైరికల్ గా నాగ చైతన్య ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఈ వీడియో లో కుస్తీ పోటీలలో అమ్మాయి చేతిలో ఆ అబ్బాయి ఓడిపోతాడు. ఇది సరిగ్గా ఆమె నాగ చైతన్య పెళ్లి జరిగిన రోజే అప్లోడ్ చేయడం తో అక్కినేని అభిమానులు బాగా ట్రిగ్గర్ అయిపోయారు. సమంత పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    గతంలో కూడా నాగ చైతన్య శోభిత తో నిశ్చితార్థం చేసుకున్న కొత్తల్లో ఇదే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేసి అక్కినేని అభిమానులను రెచ్చగొట్టింది. అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక ఇంటర్వ్యూ లో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్నో అవమానాలను భరించానో చెప్పుకొచ్చి కంటతడి పెట్టింది. ఏకాభిప్రాయం తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా ఒక మనిషిని పరోక్షంగా టార్గెట్ చేయడం మంచిది కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎదో ఒకసారి అంటే బాధతో అనింది అర్థం చేసుకోవచ్చు, ప్రతీసారి అదే పని చేస్తే కచ్చితంగా టార్గెట్ చేస్తున్నట్టే అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.