Allu Arjun
Allu Arjun : మన టాలీవుడ్ హీరోల క్రేజ్ బౌండరీలు దాటి చాలా కాలం అయ్యింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) వంటి స్టార్ హీరోలకు ఇతర దేశాల్లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళ రేంజ్ ఇంకా పెరిగింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం తో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఈ సినిమాని ఇతర దేశాల్లోని వాళ్ళు కూడా ఎగబడి చూసారు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అనుసరించని మనిషి ఈ ప్రపంచం లో ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ఆ సినిమా ఆ స్థాయిలో ఆయన దూసుకెళ్లిపోయాడు. ఇక పాకిస్థాన్ లో క్రేజ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఒకరు అల్లు అర్జున్.
Also Read : మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే!
ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ని అత్యధిక శాతం మంది పాకిస్తానీయులు, బాంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు అనుసరిస్తూ ఉంటరారు. నిన్న అర్థ రాత్రి పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం గా మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) లో వంద మందికి ఉగ్రవాదులు హతమైన సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ప్రతీ సెలబ్రిటీ ఇండియన్ ఆర్మీ, భారత దేశ ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఫేస్ బుక్ లో ‘ఆపరేషన్ సింధూర్’ అనే ఫోటో ని ఆయన అప్లోడ్ చేసి జైహింద్ అని అనగా, పాకిస్థానీయులు వరుసగా కామెంట్స్ సెక్షన్ లోకి వచ్చి అల్లు అర్జున్ పై నిరసన వ్యక్తం చేసారు. సుమారుగా లక్షకు పైగా కామెంట్స్ వస్తే, అందులో 80 శాతం పాకిస్థానీయులవే ఉన్నాయి.
Also Read : అభిమానికి సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించిన అల్లు అర్జున్..వీడియో వైరల్!
మేము మీకు పెద్ద అభిమానులం, మీ నుండి ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు పోస్ట్ చేస్తూ, మా హీరో కి పాకిస్థాన్ లో ఇంత క్రేజ్ ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మొదటి నుండి పాకిస్థాన్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలకు మంచి క్రేజ్ ఉంది. వాళ్లకి కూడా అల్లు అర్జున్ కి వచ్చినన్ని కామెంట్స్ రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది. కేవలం ఒక్క పాకిస్థాన్ లోనే కాదు, అల్లు అర్జున్ కి దాదాపుగా ప్రతీ దేశం లోనూ ఇదే రేంజ్ క్రేజ్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Allu arjun craze in pakistan facebook post