https://oktelugu.com/

Samantha: నన్ను నిందించే వాళ్లకి సమాధానం అప్పుడే చెప్తాను అంటూ నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ సమంత ఎమోషనల్ కామెంట్స్!

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత సమంత క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకి ఈ సిరీస్ తర్వాత అవకాశాలు వచ్చాయి. కానీ మయోసిటిస్ వ్యాధి శోకడం వల్ల, ఆమె ఆ అవకాశాలన్నీ వదులుకోవాల్సి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 01:10 PM IST

    Samantha(8)

    Follow us on

    Samantha: ఆడవాళ్ళకు ఆదర్శంగా నిలిచే హీరోయిన్స్ లో ఒకరు సమంత. ముఖ్యంగా కష్టకాలం లో ఎలాంటి సపోర్టు లేకపోయినప్పటికీ కూడా, మొండిగా జీవితం లో ఉన్న అవరోధాలను దాటుకొని ఈ స్థాయిలో నిలబడిన సమంత అంటే ప్రతీ ఒక్కరికి ఎంతో గౌరవం. అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమాజం లో ఈమె ఎదురుకున్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. విషయం ఏమిటో తెలియకపోయినా, తప్పు మొత్తం సమంత మీద వేసి ఆమెని ఇష్టమొచ్చినట్టు తిట్టేవారు. ప్రేమించిన వ్యక్తి నుండి విడిపోయిన బాధతో పాటు, సమాజంలో ఇలా తిట్లను కూడా ఎదురుకోవడం అంటే ఎంత నరకప్రాయం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో ఆమెకి మయోసిటిస్ వంటి ప్రాణాంతక వ్యాధి శోకడం, ఆ వ్యాధి తో పోరాడి బయటపడడానికి రెండేళ్ల సమయం తీసుకోవడం వంటివి జరిగింది.

    ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తర్వాత సమంత క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకి ఈ సిరీస్ తర్వాత అవకాశాలు వచ్చాయి. కానీ మయోసిటిస్ వ్యాధి శోకడం వల్ల, ఆమె ఆ అవకాశాలన్నీ వదులుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ ని సగం పూర్తి చేసినందున, మిగతా సగం కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. వ్యాధి తీవ్రతతో శరీరం లో పట్టుత్వం కోల్పోతున్నప్పటికీ కూడా, ఆ వెబ్ సిరీస్ ని పూర్తి చేసింది. ఇటీవలే ఆ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యాక ఏడాది పాటు విశ్రాంతి తీసుకున్న సమంత, ఎట్టకేలకు ఈమధ్యనే మళ్ళి షూటింగ్స్ ని ప్రారంభించింది.

    ఇది ఇలా ఉండగా, సమంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈమె తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటుగా, అప్పుడప్పుడు తన మనసులో ఉండే బాధని కొన్ని ఇంగ్లీష్ పద్యాల రూపం లో చెప్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇది నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆమె కామెంట్స్ చేసినట్టుగా అనిపించింది. ఇంతకు ఆమె ఏమి అనిందంటే ‘జీవితం లో ఏదైనా రిస్క్ చేసి ఓడిపోయినప్పుడు, దానిని విజయానికి మెట్లు గా చేసుకోవాలి కానీ, అపజయం వచ్చింది కదా అని చేసే ప్రయత్నం చేయకుండా మధ్యలో ఆగిపోకూడదు. మనల్ని మనం దృడంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే మనల్ని నిందించే వారికి సమాధానం చెప్పొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.