Samantha: నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతోంది సమంత. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ.. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల శాకంతరం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్, అనే తమిళ సినిమాతో పాటు ఓ థ్రిల్లర్ చిత్రంలోనూ నటించనుంది. వీటితో పాటు, మరో తమిళ సినిమాకూ ఒకే చెప్పింది.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా దూసుకెళ్తోన్న సమంత ఇప్పుడు హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు సంతకం చేసిందట సామ్. అరేంజ్మెంట్స్ ఆఫ్ అవ్ అనే హాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
సమంత గతంలో నటించి హో బేబీ నిర్మాత అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాను నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ మూవీని హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ ప్రొడక్షన్ హౌజ్ గురు ఫిల్మ్స్ సమర్పణలో సునీత తాటి నిర్మించనున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత ఎన్. మురారి రాసిన నవల ఆధారంగా బ్రిటిష్-శ్రీలంక నటి నిమ్మి హర్‌స్గామా ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో పబ్లిష్ చేసింది. 2004లో విడుదలై నవలల్లో అత్యధికంగా అమ్ముడైన నవలల్లో ఇది ఒకటి. మరి సామ్ ఇందులో నటించడంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూాడాల్సిందే.