Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అంటే, ఎంతో కసరత్తు చేయాలి. సినిమా లాంచ్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకూ పక్కా ప్లాన్ తో సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. పవన్ డేట్లు అంత టైట్ గా ఉన్నాయి మరి. ఒక్క రోజు తేడా జరిగినా రెండు నెలలు పాటు ఖాళీగా కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు.

డేట్లు అన్నీ సినిమాలకు ఇస్తూ వస్తున్నాడు. మధ్యలో రాజకీయాలు చేయాలి. దీనికితోడు పవన్ సినిమాల్లో అంతా ప్యాడింగ్ ఆర్టిస్ట్ లే. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. షూట్ పోస్ట్ ఫోన్ అయితే, నిర్మాత చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే, పవన్ తో సినిమా అంటే ముందు పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. కానీ, అదేంటో గాని, భీమ్లా నాయక్ టీమ్ లో మాత్రం ఆ క్లారిటీ మిస్ అయింది.
సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది, అలాగే షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు కూడా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘లా లా భీమ్లా సాంగ్’ అయితే ప్రేక్షక లోకాన్ని కూడా ఓ ఊపు ఊపేసింది.
అయితే, భీమ్లా నాయక్ రిలీజ్ పై బయ్యర్లకు అనేక అనుమానాలు ఉన్నాయి. జనవరి 12న భీమ్లా నాయక్ విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా అయితే ప్రకటించారు. కాకపోతే, అది ఎంతవరకు నిజం అనేది ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మరోపక్క జనవరి 7న ఆర్ఆర్ఆర్ వస్తోంది. ఇక జనవరి 14న రాధే శ్యామ్ కూడా రిలీజ్ కి రెడీ అంటుంది.
Also Read: Ghani: పవర్ఫుల్ ప్యాక్‌తో గని టీజర్.. వరుణ్ సిక్స్‌ప్యాక్‌కు అభిమానులు ఫిదా!
మరి ఈ మధ్యలో భీమ్లా నాయక్ నిజంగా 12న వస్తుందా ? వస్తే.. కలెక్షన్స్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది ? అన్నిటికీ మించి కోరుకున్న థియేటర్స్ దొరికే పరిస్థితి ఉందా ? ఇలా అనేక వాటి పై డిస్ట్రిబ్యూటర్లలో చర్చలు జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ టీమ్ మాత్రం సినిమా వాయిదా విషయంలో ఎటువంటి క్లారిటీకి రాలేదు. అలా అని రిలీజ్ విషయంలో కూడా వాళ్ళు క్లారిటీగా లేరు.
Also Read: Anushka: బరువు తగ్గేందుకు అనుష్క డైటింగ్ ప్లాన్.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా!