Tripuraneni Chitti Babu- Samantha: తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి సమంత నటిస్తుంది. ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందంటూ సీనియర్ నిర్మాత చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సింపతీ కోసమే సమంత నాటకాలాడుతుందంటూ ఆయన మండిపడ్డారు. నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల శాకుంతలం ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సమంత లేకపోతే శాకుంతలం చిత్రం లేదంటూ… గుణశేఖర్ మాట్లాడుతూ ఉంటే సమంత కన్నీరు పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగం ఆపుకోలేక ఏడ్చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓపిక లేకపోయినా గుణశేఖర్ కోసం వచ్చాను. అందరికీ సినిమా జీవితంలో ఒక భాగం, కానీ గుణశేఖర్ కి సినిమానే జీవితం.. అంటూ మాట్లాడారు.

ప్రెస్ ఎదుట సమంత కన్నీరు పెట్టుకోవడాన్ని త్రిపురనేని చిట్టిబాబు తప్పుబట్టారు. ఆమెకు ఆరోగ్యం బాగున్నా లేకున్నా పబ్లిక్ లో ఏడ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా సమంత పబ్లిసిటీ స్టంట్. సింపతీతో తన సినిమా హిట్ చేసుకోవాలన్న ఛీప్ ట్రిక్స్ అంటూ మండిపడ్డారు. యశోద చిత్ర విషయంలో కూడా ఆమె ఇంతే చేశారు. తనకు మయోసైటిస్ ఉన్నట్లు చెప్పారు. ఆ వ్యాధితో బాధపడుతూ డబ్బింగ్ చెప్పినట్లు ఫోటోలు విడుదల చేసి ప్రచారం కల్పించుకున్నారు.
మయోసైటిస్ ప్రాణాంతక వ్యాధి కాదు. అది చాలా మందికి వచ్చింది… సమంత ఈ నాటకాలు ఆపితే బెటర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. త్రిపురనేని చిట్టిబాబు వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. తమ చిత్రాలకు పబ్లిసిటీ తెచ్చుకునేందుకు హీరోయిన్స్ ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ లో కన్నీళ్లు పెట్టుకొని సింపతీ సాధించి ప్రయోజనం పొందాలని చూస్తారు. గతంలో దీపికా పదుకొనె ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారు.

ఆమె నిర్మాతగా ఛపాక్ మూవీ తెరకెక్కింది. దీపికా యాసిడ్ అటాక్ బాధితురాలి పాత్ర చేశారు. ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకొని సింపతీ పొందాలని చూశారు. ఆమె ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ అయినట్లు లేదు. ఇక సమంత చర్యలు ఆయన ఆరోపణలు బలపరిచేవిగా ఉన్నాయి. యశోద షూటింగ్ ఎలాంటి సమస్య లేకుండా పూర్తి చేసిన సమంత ఆ చిత్ర విడుదలకు జస్ట్ రెండు వారాల ముందు తనకు మయోసైటిస్ అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. చేతికి సెలైన్ తోనే యశోద మూవీకి పని చేస్తున్నట్లు జనాల్లో ప్రొజెక్ట్ కావాలి అనుకున్నారు.
యశోద షూట్ లో సమంతలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఆమె సహనటులు చెప్పారు. సినిమా విడుదలకు ముందు మంచానికే పరిమితమైనట్లు కలరింగ్ ఇచ్చారు. కాగా శాకుంతలం మూవీ విషయంలో ఆమె సేమ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. రెండు నెలల తర్వాత బయటకు వచ్చి నాకు ఓపిక లేదంటూ ఏడ్చారు.