CM Jagan- Adnan Sami: ప్రజా ప్రతినిధిగా ఉన్నవారు నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కనుక తాము చేసే ట్వీట్లు, కామెంట్లు హుందాగా ఉండాలి. ఇందులో ఏమాత్రం లైన్ తప్పినా పరువు పోతుంది. పదిమందిలో ఇజ్జత్ పోతుంది. ఇందుకు తాజా ఉదాహరణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదంతం. ఆయన మాట తీరే నాసిరకం అనుకుంటే… చేస్తున్న ట్వీట్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి.

సమీ ఇజ్జత్ తీశాడు
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఈరోజు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం ఆ చిత్ర బృందానికి జేజేలు పలుకుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా “తెలుగు ఫ్లాగ్ ఇస్ ఫ్లయింగ్ హై” అని ట్వీట్ చేశారు.. దీనిపై సింగర్ అద్నాన్ సమీ స్పందించాడు.. తెలుగు ఫ్లాగ్ అంటే ఏమిటని షమీ ట్విట్టర్ లో జగన్ ను ప్రశ్నించాడు.. తెలుగు ఫ్లాగ్ ప్రత్యేకంగా ఉందా? ఫ్లాగ్ అంటే ఇండియన్ ఫ్లాగ్ అనే కదా అర్థం అని ప్రశ్నించాడు.. మనం మొదట భారతీయులమని, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని జగన్ కు సూచించాడు. మొదట ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు.. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యక్రమాలలో మనదంతా ఒకే దేశం అనే సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. విభజన ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మనం 1947లో చూసామని జగన్ కు గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్
జగన్ పై షమీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి అద్నాన్ షమీ స్వతహాగా ఇండియన్ కాదు.. ఆయన తండ్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సులో పనిచేస్తారు. అయితే షమీ లో లండన్ లో పుట్టి పెరిగారు. ఆయనకు పాకిస్తాన్ పౌర సత్వం ఉన్నది.. కానీ దాన్ని వదులుకుని ఇండియన్ గా స్థిరపడ్డారు. ఆయనకు ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది.. షమీతల్లి కాశ్మీర్ వాసి. అయితే షమీ ఇండియా పై అత్యంత భక్తి చూపిస్తారు.. పలు తెలుగు పాటలు కూడా పాడారు. వర్షం సినిమాలో ఆయన పాడిన “నచ్చావే నైజాం పోరీ” ఎంత ఫేమసో చెప్పాల్సిన పనిలేదు. ఇక భారత్ అంటే విపరీతమైన అభిమానం చూపించే షమీ..జగన్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం నచ్చలేదు. అందుకే ట్విట్టర్ వేదికగా కడగి పారేశారు.