Samantha : నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు జరిగిన తర్వాత సమంత(Samantha Ruth Prabhu) ఒంటరిగానే జీవిస్తున్న సంగతి తెలిసిందే. కానీ నాగ చైతన్య మాత్రం యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని ప్రేమించి పెళ్లాడాడు. అప్పటి నుండి సమంత అభిమానులు నువ్వు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ ఉండేవారు. సమంత నుండి ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి రియాక్షన్స్ రాలేదు కానీ, బాలీవుడ్ లో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మాత్రం ‘ఇలాగే సోలో గా ఉండిపోతారా?’ అని అడిగితే, కచ్చితంగా కాదు అంటూ సమాధానం చెప్పింది. ఈమె ఈ సమాధానం చెప్పిన అతి కొద్దిరోజుల్లోనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ మొదలైంది. రాజ్ నిడిమోరు గతంలో సమంత తో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ చేశాడు.
Also Read : నాగ చైతన్య నుండి 200 కోట్ల ఆఫర్..రిజెక్ట్ చేసిన సమంత!
సమంత కష్టకాలం లో రాజ్ నిడిమోరు చాలా సహాయం గా ఉండేవాడని, సమంత మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యంగా కోలుకునేందుకు అతను చాలా సహాయపడ్డాడని, అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ పెరిగి డేటింగ్ చేసుకునే స్థాయికి వెళ్లిందని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఈమధ్య కాలం లో బాలీవుడ్ లో సమంత ఏ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లినా రాజ్ నిడిమోరు తో కలిసి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మరో విశేషం ఏమిటంటే సమంత రూమర్స్ పై చాలా గట్టిగ స్పందిస్తుంది. అలాంటి సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. కానీ నేషనల్ లెవెల్ లో ఆమె డేటింగ్ గురించి ఈ రేంజ్ కథనాలు ప్రచురితం అవుతుంటే, ఆమె నుండి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు, అంటే ఇది నిజమైన వార్తనే అన్నమాట అని అభిమానులు సైతం ఫిక్స్ ఐపోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలలో అభిమానులు ఒక విషయాన్ని గమనించారు. ఆమె చేతిలో ఒక డైమండ్ రింగ్ ఉండడాన్ని చూసి, సమంత నిశ్చితార్థం చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విశ్లేషణ కూడా బాగా వైరల్ అయ్యింది. సమంత కనీసం దీనిపైనా అయినా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే అనారోగ్యం నుండి పూర్తి స్థాయిలో కోలుకున్న సమంత ఇక నుండి ఫుల్ గా బిజీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఒక పక్క ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరో పక్క హీరోయిన్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈమె ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: లేడీ విలన్ గా రెజీనా ఫుల్ బిజీ..రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందంటే!