https://oktelugu.com/

Samantha : తోడు వెతుక్కున్న సమంత… ఫోటోలు వైరల్!

అయితే ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపింది. సమంత ఓ వ్యక్తితో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆయన ఫేస్ కనిపించడం లేదు. సదరు ఫోటోకి మూడ్ అంటూ కామెంట్ జోడించారు. ఈ ఫోటోపై నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరని కామెంట్ బాక్స్ లో సమంతను అడుగుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2023 / 05:59 PM IST
    Follow us on

    Samantha : సమంత భర్త నాగ చైతన్యతో విడిపోయి రెండేళ్లు కావస్తుంది. 2021 అక్టోబర్ లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అంతకు ముందే వారు విడిపోయారు. 2018లో సమంత-నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట అభిప్రాయ బేధాలతో విడాకులు తీసుకున్నారు. గొడవలకు ఇదే కారణం అంటూ అనేక థియరీలు తెరపైకి వచ్చాయి. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను నాగ చైతన్య ఫ్యాన్స్ సమంతను టార్గెట్ చేశారు. సమంత ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.

    సమంత కొంత కాలం పాటు డిప్రెషన్ అనుభవించారు. స్నేహితులు,సన్నిహితులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సమంత కొన్ని నెలల తర్వాత సాధారణ స్థితికి రాగలిగారు. ఇక నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. దీనికి కొన్ని ఆధారాలు కూడా లభించాయి. సమంత మాత్రం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆమె రెండో పెళ్లిపై కొన్ని కథనాలు వెలువడ్డాయి కానీ… అవి గాలి వార్తలు గానే మిగిలిపోయాయి. సమంత నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు.

    అయితే ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపింది. సమంత ఓ వ్యక్తితో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆయన ఫేస్ కనిపించడం లేదు. సదరు ఫోటోకి మూడ్ అంటూ కామెంట్ జోడించారు. ఈ ఫోటోపై నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరని కామెంట్ బాక్స్ లో సమంతను అడుగుతున్నారు. సింగిల్ గా ఉన్న సమంత తోడు వెతుక్కుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే అది నిజం కాదని ఓ వర్గం వాదన. ఆ ఫోటోలో సమంతతో పాటు ఉన్న వ్యక్తి సిటాడెల్ డైరెక్టర్. షూటింగ్ సెట్స్ లో ఇద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారని అంటున్నారు.

    సమంత ప్రస్తుతం సెర్బియా దేశంలో ఉన్నారు. సిటాడెల్ లేటెస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు. సమంత ప్రేమలో పడ్డారనేది వాస్తవం కాదంటున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకులుగా ఉన్నారు. అలాగే సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి మూవీలో నటిస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.