https://oktelugu.com/

ఎలర్జీ పై సమంతకు సూచనలు.. అందరికీ ధన్యవాదాలు !

అక్కినేని సమంతకు తన పెట్ అంటే.. మహా ప్రేమ అనే విషయం అందరికీ తెలిసిందే. సమంత పెట్ కు సెపరేట్ బెడ్, సెపరేట్ రూమ్, ప్రత్యేకంగా దానికంటూ ఇద్దరు పనివాళ్ళు.. ఇలా మొత్తానికి ఆ పెట్ కు పెద్ద లగ్జరీ లైఫే ఉంటుంది. పైగా సమంత కూడా తన కుక్క పిల్లను ఎంత గారాభం చేస్తుంటుంది. పెట్ కు కూడా సమంత అంటే మహా ప్రేమ అట. అందుకే లాక్ డౌన్‌లో సమంత చేసిన సేంద్రియ వ్యవసాయ […]

Written By:
  • admin
  • , Updated On : September 22, 2020 / 02:47 PM IST
    Follow us on


    అక్కినేని సమంతకు తన పెట్ అంటే.. మహా ప్రేమ అనే విషయం అందరికీ తెలిసిందే. సమంత పెట్ కు సెపరేట్ బెడ్, సెపరేట్ రూమ్, ప్రత్యేకంగా దానికంటూ ఇద్దరు పనివాళ్ళు.. ఇలా మొత్తానికి ఆ పెట్ కు పెద్ద లగ్జరీ లైఫే ఉంటుంది. పైగా సమంత కూడా తన కుక్క పిల్లను ఎంత గారాభం చేస్తుంటుంది. పెట్ కు కూడా సమంత అంటే మహా ప్రేమ అట. అందుకే లాక్ డౌన్‌లో సమంత చేసిన సేంద్రియ వ్యవసాయ పనుల్లో ఆ కుక్కపిల్ల కూడా తనకు చేతనైన సాయం చేసిందట. తన పెట్ తనకు ఎలా సాయం చేసిందో సమంత అందరికీ వివరిస్తూ.. ‘నా పెట్, నా వెంటే ఉంటే మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది అంటూ.. ఆ పెట్ కి సంబంధించిన వీడియోలను కూడా సమంత ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    Also Read: టీజర్ టాక్: ‘చావుకబురు’తో చల్లగా చెప్పి రెచ్చిపోయిన కార్తీకేయ

    అయితే తాజాగా పెట్ విషయంలో సమంతకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. సమంత తన పెట్‌ కు స్కిన్ ఎలర్జీ వచ్చిందని.. తన పెట్ ఎలర్జీతో తెగ ఇబ్బంది పడుతుందని తెగ ఫీల్ అవుతోంది. పెట్ కి ఎలర్జీ తగ్గించే ప్రయత్నాలన్ని సమంత ఇప్పటికే చేసిందట, పైగా అన్ని రకాల మెడిసిన్స్, జాగ్రత్తలు కూడా తీసుకుందట.. కానీ పెట్ కి మాత్రం ఎలర్జీ తగ్గలేదని.. రోజులు గడుస్తున్నా పెట్ ఆరోగ్యం విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదట. మొత్తానికి తన పెట్ బాధను చూపెడుతూ.. ఆ ఎలర్జీ ఎలా ఉందో వీడియోలో కూడా సమంత చూపెట్టింది.

    ఆ వీడియోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన పెట్ ఎలర్జీకి నివారణ పద్దతులు తెలిసిన వాళ్లు దయచేసి వివరించి సాయం చేయండని సమంత నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది. అసలుకే స్టార్ హీరోయిన్.. పైగా స్టార్ హీరోకి సతీమణి అయ్యే.. అందుకే సమంత పెట్ ఎలర్జీ గురించి సాయం చేయమని అడిగినే వెంటనే.. నెటిజన్లల్లో కొందరు ఆలీవ్ ఆయిల్ వాడాలని, ఇంకొందరు హోమియోపతి బెటర్ అని, మరికొందరు యాపిల్ సీడ్ వెనిగర్ అయితే బాగుంటుందని ఇలా సలహాలు, సూచనలు ఇస్తూ.. తమకు తోచిన, తెలిసిన పద్దతులను, మందులను సమంతకు సజెస్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. కాగా తనకు పెట్ ఎలర్జీకి సంబందించి సాయం చేసిన ప్రతీ ఒక్కరికి సమంత పేరు పేరునా ధన్యవాదాలు చెప్పింది.