https://oktelugu.com/

కలర్ ఫుల్ గా కనిపించే హీరోయిన్లలో కూడా.. !

ఎప్పుడూ గ్లామర్ డోస్ తో కలర్ ఫుల్ గా కనిపించే హీరోయిన్లలో కూడా గొప్ప భక్తి ఉంటుందని అనుష్క, సమంత, రకుల్ లాంటి పలువురు తెలుగు హీరోయిన్లు నిన్న మహాశివరాత్రి సందర్భంగా సగర్వంగా చాటి చెప్పుకున్నారు. అయినా తనకు భక్తి ఎంత ఎక్కువ లేకపోతే సమంత రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తుంది. ఓ సందర్భంలో తనలోని దైవ భక్తినే తన జీవితాన్ని తీర్చిదిద్దిందని కూడా సమంత చెప్పుకొచ్చింది. తనకు దేవుడు మంచి జీవితాన్ని మంచి కుటుంబాన్ని ఇచ్చాడని […]

Written By:
  • admin
  • , Updated On : March 12, 2021 / 05:20 PM IST
    Follow us on


    ఎప్పుడూ గ్లామర్ డోస్ తో కలర్ ఫుల్ గా కనిపించే హీరోయిన్లలో కూడా గొప్ప భక్తి ఉంటుందని అనుష్క, సమంత, రకుల్ లాంటి పలువురు తెలుగు హీరోయిన్లు నిన్న మహాశివరాత్రి సందర్భంగా సగర్వంగా చాటి చెప్పుకున్నారు. అయినా తనకు భక్తి ఎంత ఎక్కువ లేకపోతే సమంత రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తుంది. ఓ సందర్భంలో తనలోని దైవ భక్తినే తన జీవితాన్ని తీర్చిదిద్దిందని కూడా సమంత చెప్పుకొచ్చింది. తనకు దేవుడు మంచి జీవితాన్ని మంచి కుటుంబాన్ని ఇచ్చాడని ఈ అక్కినేని కోడలు ఇప్పటికే తెలిపింది.

    సమంత మాటలు విందేమో.. రకుల్ ప్రీత్ సింగ్ కూడా వీరి గ్యాంగ్ లో చేరింది. అందరూ కలిసి శివరాత్రి పురస్కరించుకొని కోయంబత్తూర్ వెళ్లారు. వెళ్ళిన బ్యాచ్ లో సమంత, రకుల్, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి ఉన్నారు. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో వీరంతా పాల్గొని తమలోని భక్తీ భవాన్ని చూపారు. అయితే సమంతకి పెళ్ళైన తర్వాత భక్తి బాగా పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సమంత పుట్టింది క్రిస్టియన్ గా, అయితే ఆమె నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత హిందువుగా మారి పూజలు వ్రతాలూ చేస్తూ ముందుకు సాగుతుంది.

    ఇక సమంత ఈ నెలలో ‘శాకుంతలం’ షూటింగ్ మొదలు పెడుతుందట. అన్నట్టు లక్ష్మి మంచు కొన్నాళ్లుగా గుళ్ళు,గోపురాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తోందని.. ఎప్పుడూ బోల్డ్ గా కమర్షియల్ గా కనిపించే మంచు లక్ష్మిలో ఈ భక్తి యాంగిల్ చాల కొత్తగా ఉందని అనుకుంటున్నారు. మరో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ వ్యవహారం మరోలా ఉంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ యమా బిజీగా ఉంది. అయినా తనలోని ఆధ్యాత్మిక బంధాన్ని పెంచుకోవడానికి అమ్మడు తెగ ప్రయత్నం చేస్తోంది. మరి తనకు కూడా సమంతలా లైఫ్ సెట్ అవుతుందేమో అని ఆశ పడుతుందేమో.