ఏపీపై కేటీఆర్ ప్రేమ.. రేపు తమ మెడకు చుట్టుకుంటుందనేనా?

పక్క రాష్ట్రం ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు విజయశాంతి సహా ప్రతిపక్షాల నేతలు మంత్రి కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ ఏపీ పై ఆవాజ్య ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని హరిత ప్లాజా హోటల్ లో తెలంగాణ […]

Written By: NARESH, Updated On : March 12, 2021 5:07 pm
Follow us on

పక్క రాష్ట్రం ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు విజయశాంతి సహా ప్రతిపక్షాల నేతలు మంత్రి కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ ఏపీ పై ఆవాజ్య ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అయితే తాజాగా హైదరాబాద్ లోని హరిత ప్లాజా హోటల్ లో తెలంగాణ ఐకాస సమితి సదస్సులో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ ఉక్కును తుక్కుతుక్కుగా అమ్మేస్తున్నారని.. నీవెవరు అని అడిగేందుకు అని నన్న నిలదీస్తున్నారని.. ఏపీతో నీకేం పని అని అంటున్నారని కేటీఆర్ వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే 80వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను రోడ్డున పడేసిందని.. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా? ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారని.. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పై కూడా పడుతారని కేటీఆర్ వివరించారు. ఏపీకి కష్టం వచ్చింది కదా అని మాకేంటి అని నోరు మెదపకుండా రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరికో కష్టం వచ్చింది మాకెందుకు లే అనుకుంటే సరికాదన్నారు. మొదట భారతీయులం, తర్వాతే తెలంగాణ బిడ్డలం అని అన్నారు.

దేశంలో ధరలను భారీగా ెంచిన బీజేపీకి ఓటిస్తే వారి పాలనకు ధరలు భరించడానికి ఆమోదం తెలిపినట్టేనని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయవాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? అని మండిపడ్డారు.

మొత్తంగా ఏపీ తరుఫున వకాల్తా పుచ్చుకున్న కేటీఆర్ రేపు తమ మెడకు చుట్టుకునే ప్రైవేటీకరణపై ముందుగా స్పందించానని.. తమ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకే ఈ ఉద్యమానికి సపోర్టు చేశానని చెప్పకనే చెప్పారు.