Samantha Raj Nidimoru Marriage: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సమంత(Samantha Ruth Prabhu) మరియు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ప్రేమించుకుంటున్నారని, వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్కసారి కూడా అటు సమంత వైపు నుండి కానీ, రాజ్ నిడిమోరు వైపు నుండి కానీ ఈ వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పైగా వీళ్లిద్దరు కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండేవారు. దీన్ని బట్టీ ఫ్యాన్స్ కూడా వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అధికారికంగా ఫిక్స్ అయిపోయారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి ప్రచారం అవుతున్న ఒక వార్త ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే వీళ్లిద్దరు నేడు కోయంబత్తూరు లోని ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట.అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైలెంట్ గా జరిగిపోయాయని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలీ ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీని అర్థం వీళ్లిద్దరు నిజంగానే తెగించి పెళ్లి చేసుకుంటున్న విషయం ఆమెకు తెలియబట్టే అలాంటి పోస్టు పెట్టి ఉంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ నుండి రాజ్ నిడిమోరు తో సమంత కి పరిచయం అయ్యింది. ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాతనే సమంత, నాగ చైతన్య విడిపోయారు. అదే విధంగా రాజ్ నిడిమోరు, శ్యామిలీ జంట కూడా ఈ వెబ్ సిరీస్ తర్వాతే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టీ చూస్తే ఈ వెబ్ సిరీస్ రెండు కుటుంబాల మధ్య పెద్ద చిచ్చు రగిలించింది అనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 విడుదలైంది. ఈ సిరీస్ కి మొదటి రెండు సీజన్స్ కి వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ విడుదల అయ్యాక సమంత, రాజ్ లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, అందుకే వీళ్ళు ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారని టాక్. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే నేడు సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే చిత్రం విడుదలై కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతుంది.