https://oktelugu.com/

Dhanush: రామ్ చరణ్ మరియు ప్రభాస్ లు నాలాగా మోసపోకూడదని కోరుకుంటున్నాను: ధనుష్

Dhanush: సౌత్ ఇండియా లో మోస్ట్ క్రేజీ స్టార్ హీరోలలో ఒకరు ధనుష్..తమిళం లో ఈయనకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..నటన పరంగా ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరు ఆయన..తమిళ్ లో స్టార్ హీరో గా కొనసాగుతూనే..బాలీవుడ్ లో కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేమైన గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇటీవలే ఆయన హీరో గా నటించిన ‘అసురాన్’ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు..అంతే కాకుండా ఆయన పాపులారిటీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 02:33 PM IST
    Follow us on

    Dhanush: సౌత్ ఇండియా లో మోస్ట్ క్రేజీ స్టార్ హీరోలలో ఒకరు ధనుష్..తమిళం లో ఈయనకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..నటన పరంగా ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరు ఆయన..తమిళ్ లో స్టార్ హీరో గా కొనసాగుతూనే..బాలీవుడ్ లో కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేమైన గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇటీవలే ఆయన హీరో గా నటించిన ‘అసురాన్’ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు..అంతే కాకుండా ఆయన పాపులారిటీ మరియు క్రేజ్ దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోవడం తో హాలీవుడ్ లో కూడా నటించే అవకాశం దక్కింది..ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవ్వగా , దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..హాలీవుడ్ లో కెప్టెన్ అమెరికా చిత్రం లో హీరో గా నటించిన క్రిస్ ఇవాన్స్ ఇందులో హీరో గా నటించగా ధనుష్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడు..ఆయన పాత్రకి ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా ధనుష్ అభిమానులు అయితే తమ హీరో హాలీవుడ్ రేంజ్ కి ఎదిగినందుకు గర్వపడుతున్నారు.

    Dhanush, Ram Charan and Prabhas

    అయితే ధనుష్ మాత్రం ఈ సినిమాలో తన పాత్ర పై సంతృప్తి గా లేనట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది..సినిమాలో తన పాత్ర చాలా వరుకు ఎడిటింగ్ లో తీసేసారు అని ధనుష్ బాగా ఫీల్ అయ్యాడట..ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో ధనుష్ మాట్లాడుతూ ‘హాలీవుడ్ పరిశ్రమ లో అడుగుపెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది..హాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు మన సౌత్ స్టార్స్ తో సినిమాలు తియ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Also Read: Samantha- Naga Chaitanya: విడాకులు తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత – నాగచైతన్య

    Dhanush

    ఇప్పటికే రామ్ చరణ్ మరియు ప్రభాస్ డేట్స్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు..కానీ వారికి నా నుండి ఇచ్చే సలహా ఏమిటి అంటే,దయచేసి స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో జాగ్రత్తలు వహించండి..కేవలం హీరో రోల్ అయితేనే ఒప్పుకొంది..ముఖ్య పాత్రలు చెయ్యొద్దు..చాలా రాజకీయం చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్..ఆయన మాటలను బట్టి చూస్తుంటే ‘ది గ్రే మ్యాన్’ లో ఆయన పోషించిన పాత్రపై సంతృప్తిగా లేనట్టు తెలుస్తుంది..మరి ధనుష్ మాటలను రామ్ చరణ్ మరియు ప్రభాస్ ఎలా తీసుకుంటారో చూడాలి.

    Also Read:Vijay Devarakonda: మనం షేక్ చేసినం అమ్మా… ర‌మ్యకృష్ణకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్

    Tags