‘అక్కినేని సమంత’ తన సినీ కెరీర్ లో మొదటిసారి ఒక వెబ్ సిరీస్ చేసింది. అదే ‘ది ఫ్యామిలీ మేన్ 2’. ఇప్పుడు, ఈ వెబ్ సిరీస్ ఆమెకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ ట్రైలర్ రిలీజ్ అయిన క్షణం నుండి తమిళీయులు సమంత మీద విరుచుకు పడుతున్నారు. కారణం ఈ వెబ్ సిరీస్ లో సమంత తీవ్రవాదిగా నటించింది. అయితే ‘ఎల్టీటీఈ’ను ఒక తీవ్రవాద సంస్థగా చూస్తే తమిళీయులకు నచ్చదు. వాళ్ల దృష్టిలో అదొక పోరాటం.
ముఖ్యంగా శ్రీలంకలోని తమిళీయుల కోసమే పోరాడిన ఎల్టీటీఈ అంటే వారికి ప్రత్యేక అభిమానం. పైగా వారికి అదొక ఎమోషనల్ బాండింగ్. ఇవ్వన్నీ తెలియని సమంత వెబ్ సిరీస్ లో ఎల్టీటీఈ తీవ్రవాదిగా నటించింది. నటిస్తే నటించింది, రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆమె పాత్ర నెగెటివ్ గా ఎలివేట్ అవ్వడంతో ఈ వెబ్ సిరీస్ పై తమిళ ప్రజలు సీరియస్ అవుతున్నారు.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. ఈ క్రమంలో సమంత పై కూడా వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వివాదానికి సమంత ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో. నిజానికి సమంత పుట్టి పెరిగింది తమిళనాడులోనే. ఆమె ఒక తమిళయన్. అయినా ఆమెను కూడా వదిలిపెట్టట్లేదు.
మరి ఈ తెలుగింటి కోడలు, పుట్టింటి తమిళ సమాజాన్ని ఎలా శాంతింప చేస్తోందో చూడాలి. అయితే, ఈ వివాదం వల్ల ‘ది ఫ్యామిలీ మేన్ 2’కి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. తమిళంలో ఈ సిరీస్ పై పెద్గగా ఆసక్తి చూపించని ప్రేక్షకులు కూడా, ఇప్పుడు ఈ వివాదంతో ఈ సిరీస్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో ఈ సిరీస్ కి తమిళంలో కూడా మంచి వ్యూస్ వచ్చేలా ఉన్నాయి.