పెళ్లైతే మీ ఇద్ద‌రి మ‌ధ్య‌నా జ‌రిగేది అదేః వ‌ర్షిణితో యాంక‌ర్‌ ర‌వి

బుల్లి తెర‌పై రాణిస్తున్న యాంక‌ర్ ర‌వి గురించి స్పెష‌ల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన టైమింగ్ తో.. పంచ్ ల‌తో అత‌ను చేసే యాంక‌రింగ్ కు మ‌స్తుమంది ఫ్యాన్స్ ఉన్నారు. లేడీ యాంక‌ర్లు హ‌వా సాగించే స్మాల్ స్క్రీన్లో త‌న‌దైన‌ స‌త్తా చాటుతున్నాడు. కేవ‌లం టీవీ షోస్ లోనే కాకుండా.. సినిమా వేడుకల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే.. ర‌వికి మాంచి జోడీగా మారింది యాంక‌ర్ వ‌ర్షిణి. కొంత కాలంగా వీరిద్ద‌రూ ఏ రేంజ్ […]

Written By: NARESH, Updated On : May 21, 2021 10:16 am
Follow us on

బుల్లి తెర‌పై రాణిస్తున్న యాంక‌ర్ ర‌వి గురించి స్పెష‌ల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన టైమింగ్ తో.. పంచ్ ల‌తో అత‌ను చేసే యాంక‌రింగ్ కు మ‌స్తుమంది ఫ్యాన్స్ ఉన్నారు. లేడీ యాంక‌ర్లు హ‌వా సాగించే స్మాల్ స్క్రీన్లో త‌న‌దైన‌ స‌త్తా చాటుతున్నాడు. కేవ‌లం టీవీ షోస్ లోనే కాకుండా.. సినిమా వేడుకల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

అయితే.. ర‌వికి మాంచి జోడీగా మారింది యాంక‌ర్ వ‌ర్షిణి. కొంత కాలంగా వీరిద్ద‌రూ ఏ రేంజ్ స్టార్ డమ్ తో దూసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. మొద‌ట్లో.. పటాస్ షోను శ్రీముఖి – రవి కలిసి ర‌న్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో ఈ షో ఫుల్ సక్సెస్ అయ్యింది. అయితే.. ఈ షో పీక్స్‌లో ఉండగానే.. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది.

దీంతో.. ప‌టాస్ ప్రోగ్రామ్ కు మ‌రో క్వీన్ అవ‌స‌ర‌మైంది. అయితే.. ప‌టాస్ లో ఫ‌న్ ఏ మాత్రం మిస్ కాకుండా.. ఫిక్స్ చేయడానికి నేనున్నానంటూ దూసుకొచ్చింది వ‌ర్షిణి. కానీ.. శ్రీముఖి యాంక‌రింగ్ ను వ‌ర్షిణి రీప్లేస్ చేయ‌గ‌లుగుతుందా? అని సందేహించారు చాలా మంది. బట్.. అంద‌రి అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ దూసుకెళ్లింది ర‌వి – వ‌ర్షిణి జోడీ.

అలా మొద‌లైన వీరిద్ద‌రి స్నేహం, ఆన్ స్క్రీన్ మాత్ర‌మే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లోనూ కంటిన్యూ అవుతోంది. వృత్తిపరంగానే కాకుండా వీరిద్ద‌రూ వ్యక్తిగతంగానూ సన్నిహితంగా ఉంటున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వీరంతా కలిసి సందడి చేస్తుంటారు.

అయితే.. తాజాగా ర‌వి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఇంటి ప‌నులు చేస్తూ క‌నిపించాడు ర‌వి. అంతేకాదు.. దానికి ‘మ‌గువా.. మ‌గువా’ సాంగ్ ను పేర‌డీ చేశాడు. ‘పురుషా.. పురుషా..’ అనే పాటను యాడ్ చేశాడు. ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోకు వ‌ర్షిణి కామెంట్ చేసింది. ‘‘అయ్యో రవన్న ఏంటి ఇలా అయిపోయావ్‌? కానీ.. మ‌స్త్ ఉంది చూడ్డానికి’’ అంటూ ఫన్ క్రియేట్ చేసింది. దీనికి రవి కూడా రిప్లే ఇచ్చాడు.

‘వర్షిణి.. సమాజంలో ప్రతీ మగాడి పరిస్థితి ఇంతే క‌దా. రేపు పెళ్లి త‌ర్వాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి. నువ్వు చేయిస్తావ్ కూడా’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో.. న‌వ్వుల వ‌ర్షం కురుస్తోంది. చాలా మంది ర‌వి కామెంట్ కు ఎమోజీల‌తో సూప‌ర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.