https://oktelugu.com/

రాజకీయ నాయకులు కూడా వర్క్ ఫ్రం హోమ్?

కరోనా విజృంభిస్తున్న తరుణంలో వివిధ రంగాల ఉద్యోగులే కాదు చివరికి రాజకీయ నాయకులు కూడా వర్క్ ఫ్రం హోం కు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన ఉంటున్న ఫామ్ హౌజ్ లోనే భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ నుండే పాలన కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా కేసీఆర్ బాట పట్టారు. ఇటీవల బెంగళూరులోని సిఎం కార్యాలయంలో అధికారులకు కరోనా పరీక్షలు చేయగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 9:35 pm
    Follow us on

    Telangana-Agriculture

    కరోనా విజృంభిస్తున్న తరుణంలో వివిధ రంగాల ఉద్యోగులే కాదు చివరికి రాజకీయ నాయకులు కూడా వర్క్ ఫ్రం హోం కు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన ఉంటున్న ఫామ్ హౌజ్ లోనే భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ నుండే పాలన కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా కేసీఆర్ బాట పట్టారు. ఇటీవల బెంగళూరులోని సిఎం కార్యాలయంలో అధికారులకు కరోనా పరీక్షలు చేయగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అంతే కాక ఒక అధికారికి కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో అందరు అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులు పాటు ఇంటి నుంచే తమ కార్యకలాపాలు కొనసాగుతాయని యడ్యూరప్ప  చెప్పారు. ఆన్‌ లైన్‌ లో అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇస్తామని ఆయన చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన యడ్యూరప్ప ప్రజలను భయపడవద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

    తెలుగు రాష్ట్రాలలో కూడా వివిధ పార్టీ నేతలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.