అలాగే మేకప్ కోసం కూడా సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంటుందట. మొత్తానికి తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా సామ్ ట్రీట్ చేస్తోంది. పైగా ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అందుకే ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తయింది. అలాగే మరో రెండు షెడ్యూల్స్ తో కీలక సన్నివేశాలన్నీ పూర్తి కానున్నాయి.
ముఖ్యంగా ఈ నెలలో జరగబోయే షెడ్యూల్ లో సమంత, దేవ్ మోహన్ లకు సంబంధించిన ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సీన్స్ లో కాస్త రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని, ప్రేమలో పడిన తర్వాత జరిగే మొదటి కలయిక కాబట్టి, ఈ సంఘటన కారణంగా శాకుంతల తల్లి అవుతుందని, అందుకే గుణశేఖర్ కాస్త ఈ సీన్ ను బోల్డ్ గానే తీస్తారట. ఈ సీన్స్ బాగా రావాలని సమంత కూడా తెగ తాపత్రయ పడుతుందట.
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో కలసి గుణ శేఖర్ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి తెగ కష్టపడుతుంది. మరోపక్క తన కెరీర్ లోనే తొలిసారిగా చేస్తున్న మైథాలాజికల్ మూవీ కావడంతో సమంత కూడా ఈ సినిమాకి ఫుల్ కోపరేట్ చేస్తోంది. అందుకే లాక్ డౌన్ కి ముందు ఉన్న కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంది. మళ్లీ కరోనా సెకెండ్ వేవ్ తగ్గకముందే ఈ నెలాఖరునే ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చింది.