TDP on amendment of Waqf Bill
TDP : జాతీయస్థాయిలో( National wide ) అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది తెలుగుదేశం. వక్ఫ్ బిల్లు సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసింది టిడిపి. మరోవైపు జెడియు సైతం తెలుగుదేశం పార్టీకి జత కలిసింది. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఆ రెండు పార్టీలపై పెంచిన ఒత్తిడి పనిచేయలేదు. పైగా తాము చేసిన పనికి సమర్థించుకున్నాయి ఆ రెండు పార్టీలు. ఈ బిల్లు సవరణ అనేది ముస్లింలకు ప్రయోజనమే తప్ప.. నష్టం కాదని కూడా వాదించాయి. దీంతో ముస్లిం ల్లో ఈ రెండు పార్టీలను దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం విఫలమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా తాము ముస్లింలకు ప్రయోజనం చేకూర్చామే తప్ప.. నష్టపరచలేదని వారు రెండు పార్టీల ఎంపీలు లోక్సభ వేదికగా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ అంశం ద్వారా ఎన్డీఏ కూటమిలో చీలికలు తేవాలన్న ప్రయత్నాలకు బాగానే చెక్ చెప్పాయి తెలుగుదేశం, జెడియు.
Also Read : ఏపీలో పథకాలపై ఈరోజు ఫుల్ క్లారిటీ!
* గత కొంతకాలంగా వివాదం..
వక్ఫ్ సవరణ బిల్లు ఈనాటిది కాదు. గత కొంతకాలంగా నానుతూ వస్తోంది. బిజెపి( BJP) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి రావడం తర్వాత ఈ బిల్లు సవరణ విషయంలో కేంద్రం చాలా స్పీడ్ గా స్పందించింది. అయితే బిజెపి దూకుడుకు మిత్రపక్షాల ద్వారా కళ్లెం వేయాలని చూసింది ఇండియా కూటమి. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం, జెడియు ఉన్నాయి. సూపర్ విక్టరీ సాధించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించింది బిజెపి. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మెజారిటీ వస్తుందని ఆశించింది. కానీ ఓ 40 సీట్ల మెజారిటీ కి దూరంగా ఉండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి 16, జెడియు 12 ఎంపీ స్థానాలతో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాయి.
* ఆ రెండు పార్టీల సహకారం..
అయితే ముస్లింల ఆస్తులను లాక్కునేందుకు ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా పార్లమెంటులో ప్రవేశపెడుతున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నిర్ణయం తీసుకోవడంతో.. దానికి చెక్ చెప్పాలని భావించాలంటే టిడిపి, జెడియు సహకారం కోరాయి ముస్లిం మైనారిటీ సంఘాలు. ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబును కలిశారు. బిల్లుకు మద్దతు ఇవ్వద్దని కోరారు. అవసరం అనుకుంటే వ్యతిరేకించాలని కూడా కోరారు. కానీ చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. బీహార్ సీఎం నితీష్ సైతం పట్టకుండా వ్యవహరించారు. అయితే నితీష్ పై ఒత్తిడి పెంచేందుకు ముస్లిం సంఘాలు బీహార్ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు గైర్హాజరయ్యాయి. ఏపీలో సైతం ఇఫ్తార్ విందుకు పెద్దగా ముస్లిం నేతలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతోషించింది. ముస్లింలు పూర్తిస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పైపు టర్న్ అవుతారని అంచనా వేసింది.
* ముస్లింల ప్రయోజనాల కోసమే..
అయితే లోక్సభలో టిడిపి( TDP ) ఎంపీల ప్రసంగం తర్వాత పరిస్థితి మారింది. ఈ బిల్లు సవరణ పై మాట్లాడిన టిడిపి ఎంపీలు తాము కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ బిల్లును సవరించడం ద్వారా ముస్లింల హక్కులు కాల రాస్తారని భావించడం తప్పు అని చెప్పుకొచ్చారు. పైగా ఈ బిల్లు సవరణతో ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని.. ఆ మతంలో ఉన్న నిరుపేదలకు న్యాయం చేకూర్చే అవకాశం ఉందనే అభిప్రాయం పడింది. అదే సమయంలో జెడియు ప్రతినిధులు సైతం ఈ బిల్లు విషయంలో ఎన్ డి ఏ కు బలంగా మద్దతుగా నిలిచారు. జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక పార్టీలకు షాక్ ఇచ్చారు.
Also Read : అమరావతికి గ్రాండ్ ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వ సరికొత్త ఆలోచన!