Samajavaragamana Collections
Samajavaragamana Collections: క్యారక్టర్ ఆర్టిస్టు గా కెరీర్ ని ప్రారంభించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హీరో శ్రీ విష్ణు ఆ తర్వాత హీరో గా మారి విభిన్నమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఎవరు ఈ కుర్రాడు, చాలా బాగా చేస్తున్నాడే అని అందరూ అనుకుంటారు కానీ, ఇతని టాలెంట్ కి తగ్గ సూపర్ హిట్ మాత్రం ఇన్ని రోజులు పడలేదు.
ఇప్పుడు మొత్తానికి ఆయనకీ పెద్ద సూపర్ హిట్ పడింది. రీసెంట్ గా విడుదలైన ‘సామజవరగమనా’ అనే చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపొయ్యేసరికి పాపం బ్యాడ్ లక్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదని అందరూ అనుకున్నారు.
కానీ మూడవ రోజు నుండి మాత్రం ఈ సినిమా పికప్ అయిన తీరుని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా విడుదలై నేటితో వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజులు ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. మొదటి రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, రెండవ రోజు 68 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇక మూడవ రోజు అయితే ఏకంగా కోటి 7 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టగా, నాల్గవ రోజు కోటి 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అంత పెద్ద లాంగ్ వీకెండ్ ఇంత వసూళ్లు వచ్చిన తర్వాత సోమవారం రోజు కాస్త డ్రాప్స్ ఉండడం అనేది సహజం.కానీ ఈ సినిమాకి మాత్రం ఎలాంటి డ్రాప్స్ కూడా లేవు. సోమవారం రోజు 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , మంగళవారం రోజు 51 లక్షలు మరియు బుధవారం రోజు 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి వారం రోజులకు గాను 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.