Samajavaragamana 2 days collections : విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే అతి కొద్దిమంది యువ హీరోలలో ఒకడు శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణించిన ఆయన, ఆ తర్వాత హీరో గా మారి, డిఫరెంట్ టైపు స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని సొంతం చేసుకున్నాడు. హీరో గా ఎన్నో సినిమాలు చేసాడు కానీ, మనోడి బ్యాడ్ లక్ వల్ల సక్సెస్ రేట్ బాగా తక్కువే.
అయ్యినప్పటికీ ఈ కుర్రాడు ఎదో ఒకరోజు బలంగా హిట్ కొడుతాడు అనే నమ్మకంతో నిర్మాతలు ఇతనితో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఫ్లాప్స్ ఉన్నాయి కదా అని ఒక్క ఏడాది కూడా ఆయన ఖాళీగా ఇంట్లో కూర్చున్న సందర్భాలు లేవు. ‘రాజ రాజ చోర’ చిత్రం తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శ్రీవిష్ణు, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఆయన ‘సామజవరగమనా’ చిత్రం తో మన ముందుకు వచ్చాడు, మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి 2 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అది జనాల్లో వెళ్ళడానికి చాలా సమయమే పట్టింది. అందుకే మొదటి రోజు ఓపెనింగ్ చాలా తక్కువ వచ్చింది, టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రెండవ రోజు కూడా రాలేదు. అలా అని అవి వరస్ట్ కలెక్షన్స్ అని కూడా అనలేము. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది డీసెంట్ కలెక్షన్స్ అయ్యినప్పటికీ కూడా ఈ టాక్ కి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చే స్కోప్ ఉంది.
దానికి తగ్గట్టుగా రాలేదు కాబట్టే అంచనాలను అందుకోలేదు అంటూ కామెంట్ చేసున్నారు ట్రేడ్ పండితులు. అలా రెండు రోజులకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది. నిన్న మొన్నతో పోలిస్తే నేడు ఈ చిత్రానికి చాలా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.