సరిహద్దులు దాటిన పవన్ మంచితనం!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దింతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది జాలర్లు, ఇతరులు చెన్నై హార్బర్‌ లో చిక్కుకున్నారు. వాళ్లకు సరైన ఆహార సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ… తమిళంలో… తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి… ట్విట్టర్‌ లో లేఖ రాశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 12:29 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దింతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత మంది జాలర్లు, ఇతరులు చెన్నై హార్బర్‌ లో చిక్కుకున్నారు. వాళ్లకు సరైన ఆహార సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ… తమిళంలో… తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి… ట్విట్టర్‌ లో లేఖ రాశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదవాళ్లందర్నీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ ట్వీట్ పై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం వెంటనే చెన్నైలోని శ్రీకాకుళం జాలర్లకు ఈ రోజు నుంచి ఆహారం వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఇదే విషయాన్ని పళని స్వామి తన ట్విట్టర్ అకౌంట్‌ లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్… కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు.

ఇలా ఏపీ ప్రభుత్వం జాలర్లను ఆదుకోవట్లేదనే ఉత్తుత్తి విమర్శలు చెయ్యకుండా… పవన్ కళ్యాణ్… తనే స్వయంగా వారిని కాపాడేందుకు ప్రయత్నించడంతో… జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.