https://oktelugu.com/

Salman Khan Sonakshi Sinha Marriage: సోనాక్షిసిన్హాతో సల్మాన్ ఖాన్ రహస్య పెళ్లి.. పెళ్లి ఫొటోపై అసలు నిజాలు ఇవీ!

Salman Khan Sonakshi Sinha Marriage: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారంటే అది ‘సల్మాన్ ఖాన్’ మాత్రమే. ఎందుకంటే 50 ఏళ్లు అయినా కూడా ఇంకా ప్రేమాయణాలు కొనసాగిస్తూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. సల్మాన్ ఖాన్ వివిధ బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ తరచూ ముఖ్యాంశాల్లోకి వెళుతుంటాడు. అయినా బ్యాచ్ లర్ గానే కొనసాగుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాల పెళ్లి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2022 / 03:53 PM IST
    Follow us on

    Salman Khan Sonakshi Sinha Marriage: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారంటే అది ‘సల్మాన్ ఖాన్’ మాత్రమే. ఎందుకంటే 50 ఏళ్లు అయినా కూడా ఇంకా ప్రేమాయణాలు కొనసాగిస్తూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. సల్మాన్ ఖాన్ వివిధ బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ తరచూ ముఖ్యాంశాల్లోకి వెళుతుంటాడు. అయినా బ్యాచ్ లర్ గానే కొనసాగుతున్నారు.

    Salman Khan Sonakshi Sinha Marriage

    తాజాగా సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాల పెళ్లి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజం ఏంటంటే.. ఆ ఫొటో ఫోటో షాప్ లో మార్ఫింగ్ చేయబడింది. సల్మాన్ ఇప్పటికీ ఒంటరిగా ఉంటున్నాడు. 2010లో దబాంగ్ సినిమాలో సోనాక్షి సిన్హాతో కలిసి నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహపూర్వక బంధం కొనసాగుతోంది. సోనాక్షి సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’తోనే బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.

    Also Read:  ప‌వ‌న్, చిరు ఏంటిది.. వాటిని ఆపేయాలంటున్న మెగా ఫ్యాన్స్‌..!

    ‘నోట్‌బుక్’ నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇటీవలి పుకార్లు సూచించాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ “జహీర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటివాడు. ఈ వార్త చాలా ఫన్నీగా ఉన్నందున మేము నవ్వుకున్నాం. మేము కలిసి డబుల్ ఎక్స్‌ఎల్‌లో పనిచేశాము. నటుడిగా నేను అతన్ని నిజంగా అభినందిస్తున్నాను. అతను తన మొదటి చిత్రం నోట్‌బుక్‌లో చాలా బాగా నటించాడు.డబుల్ ఎక్స్‌ఎల్‌లో అతని పాత్ర తన తొలి చిత్రంలో చేసిన దానికి భిన్నంగా ఉంటుంది. అతను చాలా ప్రతిభావంతుడు. ఖచ్చితంగా చూడవలసిన వ్యక్తి అని సోనాక్షి కొనియాడింది.

    Salman Khan

    ఈ ఏడాది సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. కెమెరా ముందు తన ప్రయాణాన్ని క్లుప్తంగా చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో, నన్ను సవాలు చేసే లేదా నా పరిమితులకు మించి నటుడిగా నన్ను వేరే కోణంలో చూపించే పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను ప్రజలను ఆశ్చర్యపర్చడంతోపాటు వారిని అలరించాలనుకుంటున్నాను. కాబట్టి, అవును, నేను ఇప్పటివరకు చేస్తున్నదానిని అనుసరించబోతున్నాను.

    ఇక సల్మాన్ తో పెళ్లి వార్తలపై సోనాక్షి కొట్టిపారేసింది. ఆ పిక్ ఫొటో షాప్ లో ఎడిట్ చేసి వైరల్ చేశారని తెలిపింది. సల్మాన్ తో తనకు పెళ్లి కాలేదని.. అతడు ఇప్పటికీ బ్యాచ్ లర్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

    Also Read:  ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మరణానికి ముందు ఏం జరిగింది? చివరి మాటలు వైరల్.. షాకింగ్ నిజాలు

    Tags