https://oktelugu.com/

Bollywood: టుడే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

Bollywood: టుడే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన పఠాన్‌ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఆదిత్య చోప్రా యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బేనర్‌పై నటిస్తున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహామ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. కాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 03:59 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Bollywood: టుడే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా, దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన పఠాన్‌ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఆదిత్య చోప్రా యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బేనర్‌పై నటిస్తున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహామ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది.

    Shah Rukh Khan

    కాగా ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. పైగా షారుఖ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది, అందుకే ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను షారుఖ్ ఏ స్థాయిలో నిలబెట్టుకుంటాడో చూడాలి.

    Also Read:  ‘రాధేశ్యామ్’ ‘ట్రైలర్ 2’ రివ్యూ : ఎలా ఉందంటే ?

    మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో తన డ్యాన్స్‌తో అభిమానులను మరోసారి అలరించాడు. అక్షయ్ కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ సాంగ్‌కు బ్రావో స్టెప్పులు వేశాడు. “అక్షయ్‌కుమార్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న ఛాంపియన్” అని బ్రావో ఈ వీడియోకు క్యాప్షన్‌గా పెట్టాడు. దీనిపై స్పందించిన అక్షయ్‌.. బ్రావో డ్యాన్స్‌ అద్భుతమన్నాడు. త్వరలో నేను కూడా చేస్తానంటూ ఆసీస్ క్రికెటర్ వార్నర్ పేర్కొన్నాడు.

    bachchan-pandey

     

    ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. త్వరలో రాధేశ్యామ్‌ రాబోతోంది. చిత్ర వర్గాల ప్రకారం సినిమా బాగా వచ్చిందని, ఇండియన్‌ టైటానిక్‌లా ఉంటుందంటున్నారు. పాజిటివ్‌ టాక్‌ వస్తే ఇండియా మొత్తం వసూళ్ల సునామీనే. ఇక ఈ చిత్రం విడుదలైన 2 వారాలకు RRR విడుదలవుతోంది. ఇప్పటికే పాజిటివ్‌ వైబ్స్‌ ఉండగా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పుడూ బాక్సాఫీస్‌పై బాలీవుడ్‌దే ఆధిపత్యం కాగా, ప్రస్తుతం ఈ 2 చిత్రాలతో బాలీవుడ్‌ చిన్నబోతుందనే చెప్పాలి.

    Also Read:  వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

    Tags