Salman Khan : రామ్ చరణ్(Global star Ram Charan) అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ‘జంజీర్’ చిత్రం గురించి. రచ్చ, నాయక్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమిది. తెలుగు లో ‘తుఫాన్’ అనే పేరుతో అనువాదం అయ్యింది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ యాక్షన్ చిత్రం గా నిల్చిన ‘జంజీర్’ చిత్రానికి ఇది రీమేక్. అటు హిందీ లోనూ, ఇటు తెలుగు లోనూ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రాన్ని బహుశా చాలా మంది రామ్ చరణ్ అభిమానులు కూడా చూసి ఉండరేమో. ఈ కళాఖండానికి దర్శకుడు అపూర్వ లఖియా(Apoorva Lakhia). గతం లో ఈయన తీసిన బాలీవుడ్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ రామ్ చరణ్ ఇతనితో సినిమా చేయడానికి ఒప్పుకొని చేతులు కాల్చుకున్నాడు.
Also Read : హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?
ఇప్పుడు ఈయన సల్మాన్ ఖాన్(Salman Khan) తో సినిమా చేయబోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. అపూర్వ లఖియా తో బాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరో కూడా సినిమా చేసేందుకు అంగీకరించడు. అలాంటిది ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ అతనికి అవకాశం ఇవ్వడం ఏమిటి?, సల్మాన్ మతి స్థిమితం బాగానే ఉందా? అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. గత దశాబ్దం లో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ని ఏ రేంజ్ లో డామినేట్ చేసేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయనకు దరిదాపుల్లో మరో హీరో ఉండేవాడు కాదు. ఓపెనింగ్స్ లో కానీ, క్లోజింగ్ లో కానీ సల్మాన్ రేంజ్ వేరు. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత అయాన్ రేంజ్ బాగా పడిపోయింది. చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.
రీసెంట్ గానే ఆయన నుండి విడుదలైన ‘సికిందర్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ని కింగ్ లాగా ఏలిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సౌత్ హీరోల ముందు డామినేట్ అవ్వడం పై ఆయన అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అలాంటి సమయంలో ఆయన ఇప్పుడు అపూర్వ లఖియా తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త అభిమానులను వణికిస్తుంది. సినిమాల మీద ఆసక్తి లేకపోతే ఆపేయ్, నేటి తరం యువత ముందు తక్కువ అవ్వకు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు వేడుకుంటున్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తన మనసుకి నచ్చింది చేసుకుంటూ పోతుంటాడు. తన సన్నిహితులను పైకి తీసుకొని రావడంలో సల్మాన్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అపూర్వ లఖియా కూడా సల్మాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితులతో ఒకరు అపూర్వ లఖియా. అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అపూర్వకు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఆయన ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.