https://oktelugu.com/

Salman Khan: నేను రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతా..అప్పుడు మాత్రం బాగా పడుకున్న : సల్మాన్ ఖాన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఖాన్ త్రయం గా పిలవబడుతున్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు కొద్ది సంవత్సరాలు నుంచి మంచి సినిమాలను చేయడంలో కొంతవరకు వెనుకబడిపోయారనే చెప్పాలి మరి వీళ్ళ నుంచి సినిమాలు వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ కొంతవరకు ఊపిరి పోసుకుంటుంది అనుకుంటున్నప్పటికీ వాళ్ళు మంచి సినిమాలు చేయడం లేదు...

Written By: , Updated On : February 9, 2025 / 12:54 PM IST
Salman Khan

Salman Khan

Follow us on

Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో సల్మాన్
ఖాన్ (Salman Khan)ఒకరు. గత కొద్ది రోజుల వరకు బాలీవుడ్ ను ఏలిన ముగ్గురు హీరోల్లో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు కావడం విశేషం…ఇక కండల వీరుడిగా చెప్పుకునే సల్మాన్ ఖాన్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా అటెన్షన్ ని మేయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులైతే అతనికి నీరాజనం పడుతుంటారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రికార్డులను కొల్లగొట్టడంలో సల్మాన్ ఖాన్ ది ప్రత్యేకమైన స్థానమనే చెప్పాలి. ఇక గత కొద్ది సంవత్సరాల క్రితం ఫ్లాపులతో సతమతమైనప్పటికీ ప్రస్తుతం మంచి హిట్ ట్రాక్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు తమిళ డైరెక్టర్ అయిన మురుగదాస్ (Murugadas) డైరెక్షన్ లో సికిందర్ (Sikindhar) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అంటూ చెబుతుండడం విశేషం… ఇక సల్మాన్ ఖాన్ తమ్ముడు కొడుకు అయిన అర్హన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేశారు.

ముఖ్యంగా ఆయన సినిమా షూటింగ్ లో ఉండే బిజీ వల్ల రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతానని నెలలో కేవలం ఒక 2,3 సార్లు మాత్రమే తను 7 నుంచి 8 గంటలు పడుకుంటానని తెలియజేశాడు. ముఖ్యంగా షూటింగ్ గ్యాప్ లో పడుకుంటాను అలాగే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్ ఎన్ని కుదుపులకు గురైన కూడా తను హ్యాపీగా నిద్రపోతాను అని తెలియజేశాడు.

ఇక జైల్లో ఉన్నప్పుడు మాత్రం దాదాపు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయించానని తెలియజేయడం విశేషం. నిజానికి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్ గా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇప్పటికే అతని ఇన్స్పిరేషన్ చాలామంది బ్యాచిలర్స్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా సల్మాన్ ఖాన్ ఇప్పుడు తెలుగు హీరోల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని నిలబడాలంటే మాత్రం ‘సికిందర్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…