Kriti Sanon: సెలబ్రిటీస్ కు సోషల్ మీడియాలో ఒక్కసారి ప్రశంసలు అందుకుంటారు అలానే విమర్శలకు కూడా గురవుతూ ఉంటారు. వారికి ఇదేమి మీ కొత్త విషయం కాదనే చెప్పాలి ఆకతాయి నెటిజెన్స్ కామెంట్స్ కు తమదైన శైలిలో సమాదానం ఇస్తూ ఉంటారు సెలబ్రిటీస్.తాజాగా నెటిజన్ చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ హీరోయిన్ కృతిససన్ తనదైన స్టైల్లో రీ ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ” 1 – నేనొక్కడినే” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ కృతిససన్.ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో “దోచేయ్” చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ అమ్మడు. అయితే ఇటీవలే కృతిసనన్ నటించిన ‘మిమీ’ చిత్రంలోని “పరం సుందరి” పాట ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే “పరం సుందరి”పాట విడుదలైప్పటీ నుంచి తన స్నేహితులు తీవ్రంగా ఆటపట్టిస్తున్నారని “పరం ఛాయా” అనే ఓ ట్విటర్ యూజర్ నవంబర్ 25న కృతిసనన్‌కు ఓ ట్విటర్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఆ ట్వీట్ లో యూజర్ ఈ విధంగా పేర్కొన్నాడు “చిన్నప్పుడు స్కూల్‌లో ఏదీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నా ఇంటిపేరు, నా పేరును ఆటపట్టించిన వారిపై నాకు కోపం లేదు. కానీ హీరోయిన్ కృతి సనన్ ‘పరమ సుందరి’ విడుదలైనప్పటి నుంచి నేను ఇప్పటికే కనీసం 1000 సార్లు వేధించబడ్డాను. ఎందుకు ఇలా చేశావు కృతిసనన్.. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు”అని ట్విట్‌లో పేర్కొన్నాడు.దీనికి కృతి “నవ్వే ఎమోజీలతో అయ్యో సారీ” అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆదిపురుష్ షెడ్యూల్ లో బిజీగా ఉంది.