https://oktelugu.com/

Salman khan- Chiranjeevi: మెగాస్టార్ పై సల్మాన్ ఖాన్ సీరియస్..గాడ్ ఫాదర్ విడుదల ఆగిపోనుందా?

Salman khan- Chiranjeevi: ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం గాడ్ ఫాదర్..తమిళ టాప్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు..కానీ ప్రతి చిరంజీవి సినిమాకి వచ్చే హైప్ ఈ సినిమాకి రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..మలయాళం సినిమా రీమేక్ కావడం మరియు దానికి తోడు కమర్షియల్ ఎలెమెంట్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 20, 2022 / 08:27 AM IST
    Follow us on

    Salman khan- Chiranjeevi: ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం గాడ్ ఫాదర్..తమిళ టాప్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు..కానీ ప్రతి చిరంజీవి సినిమాకి వచ్చే హైప్ ఈ సినిమాకి రాకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..మలయాళం సినిమా రీమేక్ కావడం మరియు దానికి తోడు కమర్షియల్ ఎలెమెంట్స్ ఏమి లేని కావడం తో ఈ మూవీ పై జనాల్లో అంచనాలు ఏర్పడడం లేదు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..ఇటీవలే విడుదల చేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ పాట కూడా అభిమానులకు పెద్దగా ఎక్కలేదు..సల్మాన్ ఖాన్ మరియు చిరంజీవి గారి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ డాన్స్ నెంబర్ అంచనాలను అందుకోలేకపోయింది..పోనీ లిరికల్ వీడియో సాంగ్ లో డాన్స్ స్టెప్పులు చూసి తృప్తి పడుదాం అని అనుకున్న ఫాన్స్ కి లిరికల్ వీడియో టెక్నికల్ లోపం వల్ల విడుదల చేయలేకపోతున్నాం అంటూ వేసిన వీడియో అభిమానులకు విపరీతమైన కోపం ని తెప్పించింది.

    Salman khan- Chiranjeevi

    అయితే ఈ పాట ఆగిపోవడానికి కారణం కూడా ఉందంట..ఇటీవలే ఈ పాటకి సంబంధించిన ఔట్పుట్ ని చూసిన సల్మాన్ ఖాన్ తన షాట్స్ అసలు బాగా రాలేదని..పాట ఇప్పుడు విడుదల చెయ్యొద్దు అంటూ గాడ్ ఫాదర్ టీం కి మెసేజ్ చేసి ఆపించాడట..అందుకే ఈ లిరికల్ వీడియో సాంగ్ రాలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..అయితే సల్మాన్ ఖాన్ ఇచ్చిన సూచనలు తీసుకొని..ఆయన అభిరుచికి తగట్టుగా ఈ సాంగ్ లో కొన్ని మార్పులు చేసి రేపు విడుదల చేయబోతున్నారట.

    Salman khan- Chiranjeevi

    చూడాలి మరి లిరికల్ వీడియో విడుదలైన తర్వాత అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో అనేది..ఇంకా ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ బాలన్స్ ఉందట..డింపుల్ హయాతి మీద ఒక సాంగ్ ని తెరకెక్కించాలి ఉందట..సెప్టెంబర్ 23 వ తారీకు నుండి ఈ పాట చిత్రీకరణ జరుపుకోనుంది..దీనితో ఈ సినిమా కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అవుతుందట..అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి

    Tags