Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3 రేంజ్ కి వెళ్లగల సత్తా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. ఈమె టాస్కులు ఆడే విధానంని చూసి ప్రతీ ఒక్కరు ఆడపులి అని పిలవడం మొదలు పెట్టారు. చూసేందుకు అందంగా ఉండడమే కాదు, మనసులో ఉన్న మాటలను ముఖం మీదనే చెప్పే తత్త్వం ఉన్న వ్యక్తి ఆమె. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో ఆమె తీసుకొచ్చే పాయింట్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఎదుటివాడు ఈమె చెప్పే పాయింట్స్ కి నోరు మెదపలేని పరిస్థితులు గత 5 వారాల నుండి చూస్తూనే ఉన్నాం. క్యారక్టర్ పరంగా, టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇలా ఏ కోణంలో చూసినా టైటిల్ విన్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ ఈమె. అయితే ఈమెని తొక్కేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి.
బయట ప్రేరణని కావాలని నెగటివ్ చేయాలనీ కొంతమంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన పీఆర్ టీమ్స్ ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా నిన్న ఆమె చేయని తప్పుకి నిందలు మోయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే సీజన్ 4 కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా ప్రభావితమై ప్రేరణని తప్పుబట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న బిగ్ బాస్ ఇరు క్లాన్స్ కి ఒక టాస్కు ని ఇస్తాడు. ఈ టాస్కు లో వాటర్ ట్యాంక్ లో ఉన్న నీళ్లను ఒక చిన్న జార్ లో తీసుకొని, ఐల్యాండ్స్ మీద నడుస్తూ అవతల వైపు ఉన్న ఫిష్ ట్యాంక్ లో పోయాలి. ఇరు క్లాన్స్ కి ప్రత్యేకమైన ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి. అయితే ప్రేరణ హడావుడిలో ఆమె సొంత క్లాన్ కి చెందిన ఫిష్ ట్యాంక్ లో కాకుండా, రాయల్ క్లాన్ కి చెందిన ఫిష్ ట్యాంక్ లో నీళ్లు పోసిందని కొంతమంది ఫేక్ ప్రచారం చేసారు.
ప్రతీ రోజు జరిగే ఎపిసోడ్స్ కి రాత్రులు రివ్యూస్ ఇచ్చే ఆదిరెడ్డి ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ ప్రేరణని తప్పుబడుతాడు. అయితే ఆమె అభిమానులు ఆదిరెడ్డి కి వాస్తవం వివరించగా, ఆదిరెడ్డి హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూసి, ప్రేరణ ఎలాంటి పొరపాటు చేయలేదు, ఆమె నిజాయితీగానే ఆడింది, నిన్న రాత్రి నేను తప్పుగా చెప్పాను, దయచేసి ప్రేరణ అభిమానులు క్షమించండి అంటూ కాసేపటి క్రితమే ఒక వీడియో చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అలాగే ఆదిరెడ్డి పై చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈయన డబ్బులు తీసుకొని రివ్యూస్ చెప్తాడని, మిగిలిన కంటెస్టెంట్స్ కి కావాలని నెగటివ్ చేస్తాడని, గతం లో పల్లవి ప్రశాంత్ కి అలాగే చేసాడని, ఈ సీజన్ లో మణికంఠ కి కూడా ఆయన అలాగే చేస్తున్నాడంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో చూడాలి.