Salman Khan in God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా చిరు కోసం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే మొదట రూమర్స్ గా మొదలైన ఈ వార్తల్లో.. ఆ తరవాత వాస్తవం ఉంది అని తెలిసి ప్రేక్షకులు కూడా ఈ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఈ అప్ డేట్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే..
తాజాగా సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన డెట్స్ సర్దుబాటు చేసి ‘గాడ్ ఫాదర్’ మూవీకి తన షెడ్యూల్ కెటాయించాడట. వచ్చే నెల 12 నుండి 18 వరకు డేట్స్ ఇచ్చాడు. సల్మాన్ ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆరా ఇస్తున్నారు. అయితే, ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రనే తెలుగు వెర్షన్ లో సల్మాన్ ఖాన్ చేయబోతున్నాడు.
నిజానికి సల్మాన్ ఖాన్ ది ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర మాత్రమే. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక్క క్షణం దర్శనమిచ్చినా ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరు. ఏది ఏమైనా మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే.
అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి సోదరిగా లేడి సూపర్‌స్టార్ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ కూడా పాల్గొన్నాడు.
ఇక చిరు బర్త్ డే కి వచ్చిన ఈ సినిమా మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి తలకు క్యాప్ తో అలాగే చేతిలో గన్ పెట్టుకుని అలా స్టైలిష్ గా పోస్టర్ లో కనిపించే సరికి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. అందుకే, ఈ సినిమా అప్ డేట్ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.