
కేవలం సంక్షేమ నినాదంతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా గుంతలు పడిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రహదారుల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే జనసేన ఉద్యమబాట పడుతుందని హెచ్చరించారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో డిజిటల్ వేదికల ద్వారా జనసైనికులు తమ ప్రాంతాల్లోని దెబ్బతిన్న రహదారులను, వంతెనలను ఫోటోలు, వీడియోలు రూంలో ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు.