Cameraman Gangatho Rambabu’ Movie : కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి 12 ఏళ్ళు..ఫ్లాప్ టాక్ తో ఆరోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?

ఈ చిత్రం ప్రదర్శన మొదటి రోజు తర్వాత మూడు రోజుల పాటు అనేక తెలంగాణ ప్రాంతాలలో నిలిపివేశారు. టాక్ కూడా అంతగా రాలేదు, కొంతమంది యావరేజ్ అన్నారు, మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అన్నారు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం అప్పట్లో 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

Written By: Vicky, Updated On : October 18, 2024 7:22 pm

Cameraman Gangatho Rambabu' Movie

Follow us on

Cameraman Gangatho Rambabu Movie :  ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం అప్పట్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్న సమయంలో, తెలంగాణ సెంటిమెంట్స్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ అప్పట్లో పెద్ద ఎత్తున్న రచ్చ జరిగింది. దీంతో ఈ చిత్రం ప్రదర్శన మొదటి రోజు తర్వాత మూడు రోజుల పాటు అనేక తెలంగాణ ప్రాంతాలలో నిలిపివేశారు. టాక్ కూడా అంతగా రాలేదు, కొంతమంది యావరేజ్ అన్నారు, మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అన్నారు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం అప్పట్లో 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. అప్పట్లో ఇది స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకి వచ్చేంత వసూళ్లు అని చెప్పొచ్చు.

మొదటి రోజు ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్, నైజాం, ఓవర్సీస్ ప్రాంతాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. ముఖ్యంగా నైజాం బెన్ఫిట్ షోస్ గ్రాస్ విషయంలో ఈ సినిమాకి వచ్చిన రికార్డు బాహుబలి 2 వరకు పదిలంగా ఉన్నింది. కేవలం బెన్ఫిట్ షోస్ నుండే ఈ సినిమా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఇప్పటికీ ఈ రికార్డుని అనేకమంది స్టార్ హీరోలు అధిగమించలేకపోయారు. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మొదటిరోజు 8 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ లలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమాకి అయిన ఓపెనింగ్స్ లో వచ్చే వసూళ్లు అత్యంత కీలకం. ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నైజాం రెండవ రోజు నుండి మూడు రోజులు ప్రదర్శన ఆపేసినప్పటికీ కూడా ఫుల్ రన్ లో ఆ ఒక్క ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇది సాధారణమైన విషయం కాదు, పవన్ కళ్యాణ్ కి తప్ప ఎవరికీ సాధ్యం కాదని చెప్పొచ్చు. అలాంటి సినిమాని గత ఏడాది గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా, అభిమానుల నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు థర్డ్ పార్టీ కి సంబంధించిన సినిమాలను ప్రోత్సహించడం ఆపేసారు. కానీ ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రం థర్డ్ పార్టీ ద్వారా రీ రిలీజ్ అయినప్పటికీ కూడా కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. దీనిని బట్టి ఈ సినిమాకి కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. నేటికీ ఈ సినిమా విడుదలై 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు కెమెరా మెన్ గంగతో రాంబాబు హ్యాష్ ట్యాగ్ పేరిట నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.