https://oktelugu.com/

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ ను బీట్ చేయడం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వల్ల అవ్వదా..?

బాలీవుడ్ లో ఎంతమంది హీరోలు పోటీలో ఉన్న కూడా చాలా సంవత్సరాలుగా ఖాన్ త్రయం గా పిలువబడే షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే ఇక్కడ పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సౌత్ సినిమాల ఎంట్రీ తో వాళ్ళ హవా కొంచెం తగ్గింది. అయిన కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ వాళ్లే స్టార్లుగా కొనసాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 11:24 AM IST

    Shahrukh Khan

    Follow us on

    Shahrukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఖాన్ త్రయమైతే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని శాసిస్తున్నారనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోలు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ముగ్గురు హీరోలను మాత్రం బీట్ చేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఇక అందులోను కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఒకానొక సమయంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కి మధ్య చాలా విపరీతమైన పోటీ అయితే ఉండేది. కొన్నిసార్లు షారుఖ్ సల్మాన్ ని డామినేట్ చేస్తే మరికొన్నిసార్లు సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ డామేజ్ చేస్తూ సినిమాలు చేసేవారు. ఇంకా వీళ్లిద్దరితో సంబంధం లేకుండా అమీర్ ఖాన్ మాత్రం మిస్టర్ పర్ఫెక్షనిస్టు గా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆయన మంచి కథాంశాలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ హీరోలు సినిమాలను చేస్తున్నప్పటికీ అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.

    ఇక ఈ ముగ్గురిలో షారుక్ ఖాన్ సినిమాలను చేస్తూ 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కానీ సల్మాన్ ఖాన్ అయితే వరుసగా డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇక అమీర్ ఖాన్ అయితే ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ప్లాప్ అవ్వడంతో అప్పటినుంచి ఏ సబ్జెక్టుని సినిమాగా ఎంచుకోవాలి అనే ఉద్దేశ్యం లో ఇంకా ఆలోచిస్తూ కథలను వింటూనే ఉన్నాడు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ కొంతవరకు ముందు వరుసలో ఉన్నాడు. ఆయన్ని బీట్ చేసే అవకాశం ఈ ఇద్దరు హీరోలకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడున్న క్రమంలో ఈ హీరోలను కూడా పట్టించుకునే స్థాయిలో బాలీవుడ్ జనాలు అయితే లేరు. ఇక వీళ్లు అడపా దడప సినిమాలను చేస్తూ వస్తున్నారు. కాబట్టి వీళ్ల గురించి జనాలు ఎప్పుడో మరిచిపోయారనే ఉద్దేశంలో సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే వస్తున్నాయి.

    కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఎప్పుడూ జనాలకి కనిపిస్తూ ఈవెంట్స్ కి హాజరవుతూ సినిమాలను చేయడంలో కూడా చాలా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకటి నుంచి రెండు సినిమాలను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఆయనకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉండటమే కాకుండా ఆయన సినిమాలు కూడా మంచి రెవెన్యూ ను వసూలు చేస్తున్నాయి. కాబట్టి షారుఖ్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు…