SJ Surya: ‘సరిపోదా శనివారం’ సినిమా కోసం ఎస్ జే సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు చేసే పాత్రలో 100 % ఎఫర్ట్ పెట్టి నటిస్తారు. అవి కొన్నిసార్లు వర్కౌట్ అయితే, మరి కొన్నిసార్లు మాత్రం తేడా కొడుతూ ఉంటాయి...

Written By: Gopi, Updated On : August 22, 2024 11:30 am

SJ Surya(1)

Follow us on

SJ Surya: ప్రస్తుతం ఇండియన్ సినిమా మొత్తం ఒకటే అయిపోయింది. ఒకప్పుడు నార్త్, సౌత్ అంటూ తేడాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకే ప్లాట్ ఫామ్ మీదకి వచ్చేసింది. కాబట్టి ఏ భాషలో ఎవరు ఏ సినిమా చేసినా కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమాను వీక్షిస్తున్నాడు. సినిమా కంటెంట్ లో.కూడా చాలా మార్పులు అయితే వస్తున్నాయి. ఇంతకుముందు రెగ్యులర్ రొటీన్ కాన్సెప్ట్ లతో వచ్చి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన చాలామంది మేకర్స్ కూడా తమ పంథాని మార్చుకొని కొత్త విధానంలోకి అడుగుపెట్టి సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వివిధ భాషల్లో నటిస్తూ వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాగే వాళ్ళ నటనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు… ఇక ఇప్పుడు అదే కోవ కి చెందిన నటుడు ‘ఎస్ జే సూర్య’…ఈయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.. ఆయన చేసిన ప్రతి పాత్రలో ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటూనే, ఆ పాత్రకి తన పూర్తి ఎఫర్ట్ పెట్టి నటిస్తూ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తున్నాడు… నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఆయన విలన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆయన భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

ఇక ఈ సినిమాకి ఆయన దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. నిజానికి సూర్య చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కీలకమని మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి అలాంటి ఒక కీలక పాత్రలో నటించే నటుడికి అంత మొత్తంలో చెల్లించడం అనేది పెద్ద విషయం ఏమీ కాదంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు రొటీన్ రెగ్యులర్ గా నటించే చూపించే నటులను పక్కనపెట్టి వివేక్ ఆత్రేయ ఎస్ జె సూర్య ని ఈ సినిమాలో తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాను చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఒక కొత్త రకం విలనిజాన్ని చూస్తున్నాను అంటూ ఫీల్ అవ్వాలని ఆయన ఈ నిర్ణయం తీసుకొని సూర్యను విలన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది…

దానికి తగ్గట్టుగానే ఎస్ జె సూర్య కూడా చాలా డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో ఆ క్యారెక్టర్ లో నటిస్తూ మెప్పించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా తనకు భారీగా ఆఫర్లు వస్తాయని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…