https://oktelugu.com/

Salaar leaked : ‘సలార్’ ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్

ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని చూస్తామా అని అనిపించే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. అంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ సినిమాలు అన్నిటిలోకి ది బెస్ట్ గా ఉండబోతుందట.

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2023 / 09:29 PM IST
    Follow us on

    Salaar leaked : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘సలార్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈమధ్యనే ఈ చిత్రం వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.

    అయితే అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ వెంటనే స్పందించి రూమర్స్ ని ఖండించారు. దీనితో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించేలా చేస్తుంది , అదేంటో చూద్దాం.

    ప్రభాస్ సినిమాలలో ఇంటర్వెల్ సన్నివేశాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది . ఛత్రపతి సినిమా నుండి బాహుబలి 2 వరకు ప్రతీ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయేది. ఆయన కెరీర్ బెస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాలు ఛత్రపతి, రెబెల్ , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 సినిమాల్లో ఉన్నాయి. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నడూ లేని విధంగా ఉండబోతుందట.

    ప్రభాస్ కెరీర్ లో మళ్ళీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ని చూస్తామా అని అనిపించే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. అంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రభాస్ సినిమాలు అన్నిటిలోకి ది బెస్ట్ గా ఉండబోతుందట.కేవలం ఆ ఇంటర్వెల్ సన్నివేశం ఒక్కటి చాలదా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోవడానికి అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్వెల్ సన్నివేశం ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.