Salaar Trailer: కొన్ని సినిమాలు ట్రైలర్ తో బీభత్సమైన హైప్ ని క్రియేట్ చేస్తే, మరికొన్ని సినిమాలు మాత్రం వాళ్ల సినిమాకి ముందు నుంచి వచ్చిన హైప్ ని తగ్గించడానికి మరి ట్రైలర్లను వదిలినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక అలాంటి క్రమంలోనే నిన్న రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ కూడా అదేకోవకు చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ప్రభాస్ గత చిత్రాలను చూసుకుంటే సాహో, రాధే శ్యామ్, ఆది పురుషు లాంటి సినిమాల మీద కూడా ఇలాంటి హైప్ ఉండడంతోనే ఆ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.
ఇక అదే క్రమంలో ఈ సినిమా మీద హైప్ తగ్గించడానికి అలా చేసినట్టు గా తెలుస్తుంది.ఇక అలాగే సినిమా యొక్క ప్లాట్ ని ప్రేక్షకుడికి ముందే చెప్పేసి డైరెక్టర్ సినిమాలో ఏం చెప్పాలి అనుకుంటున్నాడో దాన్ని ఫుల్లుగా ఈ ట్రైలర్ లోనే చెప్పేసి ప్రేక్షకుడు థియేటర్లోకి వచ్చి కూర్చొని సినిమా చూసే విధంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఈ ట్రైలర్ అనేది ఇవ్వడం నిజంగా దర్శకుడు యొక్క తెగింపుకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అంతసేపు ట్రైలర్ ని ఇవ్వడం అనేది కమర్షియల్ సినిమాలకి విరుద్ధం కానీ ఆయన ఎంచుకున్న ప్లాట్ ని అతను సెటప్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ ని ప్రేక్షకుడికి పరిచయం చేయాలంటే మూడున్నర నిమిషాలు కావాలి కాబట్టి అందుకే ఆయన అంత సుదీర్ఘ సమయం తీసుకుని ట్రైలర్ ని కట్ చేసినట్టు గా తెలుస్తుంది…
ఇక ఈ ట్రైలర్ చూసిన అభిమానులు మొత్తం బొగ్గు గనులతో నిండిపోయి ఎటు చూసినా కూడా కేజిఎఫ్ లానే కనిపిస్తుంది అని కొంతమంది మొహం తిప్పేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కేజీఎఫ్ లో ఉన్నటువంటి ఎలివేషన్స్ కూడా ఈ సినిమాలో పెద్దగా పడినట్టుగా కనిపించడం లేదు. ఇక డైలాగుల విషయమైతే చాలా దారుణంగా ఉంది బాహుబలి లో గాని , మిర్చి సినిమాలో గాని ప్రభాస్ చెప్పిన డైలాగులు అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో చెప్పిన డైలాగుల్లో పెద్దగా ఎఫర్ట్ అయితే కనిపించడం లేదు. డైరెక్టర్ ఇలా ఎందుకు చేశాడు అనే దానిమీద ప్రభాస్ అభిమానులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక ఇది చూసిన మరి కొంతమంది ట్రేడ్ పండితులు మాత్రం ఈ సినిమా మీద హైప్ ని తగ్గించడానికే ప్రశాంత నీల్ ఒక స్ట్రాటజీ వాడుతున్నాడు.
అందుకే ట్రైలర్ ని ఇలా నార్మల్ గా వదిలాడు అంటూ సమాధానం చెబుతున్నారు. అయితే ఈ ట్రైలర్ ని చూసిన చాలామందికి ఈ ట్రైలర్ నచ్చలేదు.దాంతో మిక్స్డ్ టాక్ తో ట్రైలర్ అనేది జనాల్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిమీద కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది…