Salaar: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ హీరో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తన సత్తా చాటారు. తిరుగులేని హీరోగా స్పెషల్ ముద్ర వేసుకున్నారు ప్రభాస్. రీసెంట్ గా ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాదు ఈయన నటించిన సలార్ సినిమా కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకొని పోతున్నారు. అందులో భాగంగానే సలార్ సినిమా కూడా విడుదల అవుతుండడంతో ఈయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సలార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ అయింది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూసే అభిమానులకు తాజాగా సలార్ టీమ్ ఓ సూపర్ న్యూస్ ను చెప్పింది. ప్రభాస్ ఆటిట్యూడ్, హీరోయిజం వంటి వాటిని ఇష్టపడే వారు స్టైల్ ను కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఈ సందర్భంగా సలార్ సినిమా విడుదల అవుతుండడంతో టీ షర్ట్స్ అందుబాటులోకి తెచ్చింది టీమ్. సలార్ పేరు రాసి ఉన్న షర్ట్స్ రకరకాల కలర్స్ లో లభ్యమవుతున్నాయి. వీటి ధర కూడా అందరికి అందుబాటులో ఉండేలా చూసుకున్నారట టీమ్.
ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ విడుదల అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సలార్ టీమ్ ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. ప్రభాస్ ఆటిట్యూడ్ హీరోయిజం తో పాటు ప్రభాస్ ని స్టైల్ ని ఇష్టపడే వారు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. రూ. 499 నుంచి రూ. 1499 వరకు ఆ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే టీ షర్ట్స్ తో పాటు హుడి, హార్మ్ స్లీవ్స్ ని కూడా ఆ సైట్ నుంచి పొందవచ్చు. డిసెంబర్ 22 కు ఎక్కువ రోజుల సమయం లేకపోవడంతో ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది టీమ్. అందుకే ఇలా టీ షర్స్ట్ ను కూడా ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే భారీ ఎత్తున ఓ ఈవెంట్ ను కూడా చేయడానికి సిద్దమైంది టీమ్. ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్ లు కూడా జరగనున్నాయి.