Kajal Aggarwal: టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో లేడీస్ ఫాలోయింగ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఈ క్రేజ్ ఉంది వెంకీకి. ఇప్పుడు కూడా ఈ హీరో సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ముందు క్యూ కడుతుంటారు. నేటి తరం హీరోలు ఇప్పటికీ కూడా ఈ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించలేదు. కానీ వెంకీ మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే ఆ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి హీరోతో సినిమా ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ వదులుకుంది.. మరి ఆ వివరాలు మీకోసం..
వెంకటేష్ తో సినిమా చేయడమంటే ఏ హీరోయిన్ అయినా అదృష్టంగా భావిస్తుంటుంది. ఎందుకంటే ఆయన పక్కన హీరోయిన్ గా చేసిన వారు పాన్ ఇండియా లెవల్ లో సూపర్ స్టార్స్ గా మారుతుంటారు. టబు, దివ్య భారతి, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. వీళ్లంతా వెంకీతో సినిమాలు చేసి పాపులారిటీని దక్కించుకున్నవారే..ఇదిలా ఉంటే టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం వెంకటేష్ తో ఛాన్స్ వస్తే చేయను అని చెప్పేసింది. దీనికి కారణం కూడా బలంగానే ఉందండోయ్…
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబోలో వెంకీ మామ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. అయితే ఇందులో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటించారు. పాయల్ పాత్ర కోసం అంటే వెంకటేష్ సరసన నటించడానికి ముందుకు కాజల్ ను సంప్రదించారట. కానీ ఈ అమ్మడు ఒప్పుకోలేదట. అయితే వెంకీతో సినిమా చేయడం ఇష్టం లేక కాదంటా.. నాగచైతన్యకు అత్తగా నటించడం ఇష్టం లేక నో చెప్పిందట కాజల్.
గతంలో నాగచైతన్య కాజల్ అగర్వాల్ తో దడ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అందుకే మళ్లీ నాగచైతన్యతో నటిస్తే హీరోయిన్ గానే నటిస్తాను కానీ, అక్క, వదిన, అత్తగా చేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పిందట కాజల్. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తం మీద వెంకీ మామతో సినిమాను నాగచైతన్య వల్ల వద్దనుకుంది కాజల్.