https://oktelugu.com/

Manual Car: మాన్యువల్ కారు.. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.. ఏది బెటర్?

ఇటీవల కార్ల వినియోగం బాగా పెరిగింది. చాలామంది సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం అత్యవసర వస్తువుల్లో కారును కూడా చేర్చుకుంటున్నారు.

Written By: , Updated On : March 21, 2025 / 03:52 PM IST
Manual-VS-Automatic

Manual-VS-Automatic

Follow us on

Manual Car: ఇటీవల కార్ల వినియోగం బాగా పెరిగింది. చాలామంది సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం అత్యవసర వస్తువుల్లో కారును కూడా చేర్చుకుంటున్నారు. దీంతో పలు కార్ల కంపెనీలు సైతం కొత్త కొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే కొందరు వినియోగదారులు లో బడ్జెట్లో.. మరికొందరు వినియోగదారులు మైలేజ్లో.. ఇంకొందరు ఆటోమేటిక్ లేదా మాన్యువల్ కారు కొనాలా అని అనుకుంటున్నారు. వీటిలో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ కారులో ఏది బెటర్ అని సందేహం లో ఉంటున్నారు. ఈ రెండింటిలో ఏది బెటర్ ఇప్పుడు చూద్దాం..

మాన్యువల్ కార్లలో ధర తక్కువగా ఉంటుంది. అలాగే దీని మెయింటెనెన్స్ లో కూడా తక్కువగానే ఉంటుంది. ఆటోమేటిక్ కార్ల కంటే మాన్యువల్ కార్లలో కనీసం 15 శాతం వరకు ఇంధనం ఆదా చేసుకోవచ్చు. మాన్యువల్ కార్లపై కొండ ప్రాంతాల్లో ప్రయాణించడం కొంచెం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా డ్రైవింగ్ పై అనుభవం ఉంటేనే మాన్యువల్ కారును నడపాల్చి ఉంటుంది. కొత్తగా కారు నడపాలి అనుకునే వారికి మాన్యువల్ కారు కష్టంగానే ఉంటుంది. ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో మాన్యువల్ కారు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో గేరు మార్చడం.. క్లచ్ పట్టుకోవడం వంటి నైపుణ్యం తెలిసి ఉండాలి.

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లలో అన్ని అనుకూలంగా ఉంటాయి. కొత్తగా కారు కొన్న వారికి ఈ కార్లలో గేరు మార్చాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు గేరు మార్చాల్సిన అవసరం లేదు. అయితే ఆటోమేటిక్ కారు ధర ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీని నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకొని ఉంది. కొండ ప్రాంతాల్లో లేదా కొత్త ప్రదేశాల్లో ఈ కార్లు ఆటోమేటిక్గా గేర్లు మార్చు కుంటూ వెళ్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో గేరు మార్చడం చాలా సులభంగా ఉంటుంది.

సాధారణ కార్లలో రోడ్డు బాగాలేని సందర్భాల్లో కుదుపు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా డ్రైవింగ్ నైపుణ్యం తెలిసిన వారే ఇక్కడ వారు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆటోమేటిక్ కార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పరిస్థితిని బట్టి అవే మారుతూ ఉంటాయి. దీంతో ఎలాంటి సిబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. మాన్యువల్ కార్లలో ఓవర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. పవర్ గేర్ సిస్టం నుంచి ఇతర విడిభాగాలకు వెళ్లడానికి సమయం పడుతుంది. కానీ ఆటోమేటిక్ కార్లలో అన్ని సెన్సార్లతో కూడుకొని ఉంటాయి. దీంతో పవర్ లాస్ట్ తక్కువగా ఉండి ఎక్కువ మైలేజ్ వస్తుంది.కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది

రిపేర్ లో విషయంలో మాన్యువల్ కార్లకు మెకానిక్ లు అందుబాటులో ఉంటారు. కానీ ఆటోమేటిక్ కార్లకు నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఇది రిపేర్ కు వస్తే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఇందులో మైక్రో చిప్స్, హైడ్రాలిక్ వ్యవస్థలు సెన్సార్లతో కూడుకొని ఉంటాయి. మొత్తంగా డ్రైవింగ్ గురించి తెలిసినవారు ఆటోమేటిక్ కార్లను కొనుగోలు చేయాలి.. కొత్తగా లేటెస్ట్ కారు ఉండాలని అనుకునేవారు ఆటోమేటిక్ బెటరని ఆటోమొబైల్ రంగ నిపుణులు తెలుపుతున్నారు.