Salaar : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యధిక రికార్డ్స్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) అభిమానులకే ఉన్నాయి. రీ రిలీజ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ తీస్తే ఈ ఇద్దరి హీరోల సినిమాలే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కూడా చేరబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ కి కెరీర్ పరంగా మళ్ళీ కొత్త ఊపిరి ఊదిన చిత్రం ‘సలార్'(Salaar Movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన సినిమా కావడంతో ఆరోజుల్లో ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలై, ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చితం తో పోటీగా దిగిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : రాసి పెట్టుకోండి ‘సలార్ 2’ వచ్చాక ఏ రికార్డ్ ఉండదు : ప్రశాంత్ నీల్…
థియేటర్స్ లో ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డిస్నీ + హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ఏడాది నుండి నాన్ స్టాప్ గా ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ స్థాయిలో ఒక సినిమా ట్రెండ్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు. అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21 వ తారీఖున గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకుగాను వారం రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలెట్టారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ లో పలు థియేటర్స్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా గంటకు మూడు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇంతకు ముందు కూడా సలార్ రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయ్యింది కానీ, ఎప్పుడూ కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకోలేదు.
ప్రభాస్ కి కొత్త సినిమాలు పరంగా ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కానీ రీ రిలీజ్ లో మాత్రం ఒక్క రికార్డు కూడా లేదు. అందుకే ఈసారి ఎలా అయినా రికార్డు పెట్టాలి అనే కసితో ఈ సినిమాకి ఆ రేంజ్ టికెట్స్ తెంపుతున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి మామూలు ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పాడడం రీ రిలీజ్ లో ఈ రేంజ్ ట్రెండ్ రావడానికి మరో కారణం కూడా అయ్యుండొచ్చు. చూడాలి మరి ఈ చిత్రం తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతారా లేదా అనేది.
Also Read : సలార్ 2 లో కాటేరమ్మను ఫైట్ ను మించిన ఎలివేషన్ ఇవ్వబోతున్నరా..? ప్రశాంత్ నీల్ అంటే మామూలుగా ఉండదు…