Salar 2 movie : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్ ‘కే జి ఎఫ్’ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సలార్ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న ఈయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడనే చెప్పాలి. ఈ సినిమాతో దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ 2 సినిమాని తెరకెక్కించే పనిలో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక సలార్ 2 సినిమాలో భారీ ఎలివేషన్స్ ఇవ్వడానికి తను రెడీ అవుతున్నట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
సలార్ సినిమా తనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని సలార్ 2 సినిమాలో అంతకు మించిన ప్రభాస్ ను మీరు చూడబోతున్నారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక ఉత్తేజాన్ని నింపాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో చూపించిన కాటేరమ్మ ఫైట్ సీన్ అనేది సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
అలాగే 2023 వ సంవత్సరంలో వచ్చిన ది బెస్ట్ ఫైట్ సీన్స్ లో ఈ ఫైట్స్ మొదటి స్థానంలో ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేసి మళ్లీ ప్రభాస్ తో సలార్ 2 సినిమాను చేసి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈయన కనక ఇదే దూకుడు చూపిస్తూ ముందుకు సాగితే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తను కూడా నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయంటూ యావత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా మేధావులు సైతం వల్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతున్న కూడా తన సినిమాలన్నీ ఒకే వే లో ఉంటున్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తన పంథాను మార్చుకొని అలాంటి సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…