Salaar Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగుతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమా విడుదలైన ఎనిమిది రోజుల్లోనే సుమారు రూ. 556.84 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ప్రభాస్ అభిమానులకు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించారనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తరువాత సాహో, ఆదిపురుష్ వంటి ప్రాజెక్టులు చేసినప్పటికీ అనుకున్న విజయాన్ని సాధించి పెట్టలేకపోయాయి. అయితే పాన్ ఇండియా స్టార్ గా పేరుగాంచిన ప్రభాస్ …కేజీఎఫ్ వంటి హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ పై అభిమానులు, ప్రేక్షకులు సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించే విధంగా సలార్ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్, బీజీఎం, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానుల్లో పూనకాలు తెప్పించిందని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ గా శృతిహాసన్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఈశ్వరీ రావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు.
బాలీవుడ్ బాద్ షా నటించిన ‘డంకీ’ సినిమా సైతం సలార్ కలెక్షన్ల ముందు నిలవలేకపోయాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ పండుగ రోజున సుమారు రూ.45.77 కోట్లు వసూళ్లు చేసిందని తెలుస్తోంది. అంతేకాదు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇవాళ, రేపు వీకెండ్ కావడంతో పాటు జనవరి ఫస్ట్ కూడా ఉండటంతో సలార్ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని, దీంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయని తెలుస్తోంది.