Salaar Child Artist: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇంతకు ముందు వరుసగా ఆయనకి మూడు ఫ్లాపులు వచ్చాయి తర్వాత ప్రభాస్ కి సలార్ రూపం లో ఒక భారీ హిట్ అయితే వచ్చింది. ఇంక దాంతో ఇప్పుడు తనదైన రీతిలో ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ చిన్నప్పటి క్యారెక్టర్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్ గా కార్తికేయ ని తీసుకున్నారు.
ఆ క్యారెక్టర్ లో ఆయన నటించి మెప్పించడం తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తికేయ నటనని చూసిన ప్రశాంత్ నీల్ ఆ క్యారెక్టర్ కోసం కార్తికేయ ని తీసుకొని ఆయన చేసిన నటనకి ఫిదా అయిపోయి పృధ్విరాజ్ సుకుమారన్ సపరేట్ గా చేసే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కార్తికేయని తీసుకోమని ప్రశాంత్ నీల్ పృథ్వి రాజ్ సుకుమారన్ ని రిఫర్ చేసినట్టుగా కార్తికేయ ఒక ఇంటర్ వ్యూ లో చెప్పాడు.
అలాగే సలార్ సినిమా షూటింగ్ లో నటిస్తున్నప్పుడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏ సినిమా లో చేస్తున్నావ్ అని అడిగితే నేను సలార్ సినిమాలో చేస్తున్న అని చెప్తే వాళ్ళు ఎవరూ కూడా నమ్మలేదట పైగా కొంతమంది అయితే సొల్లు చెప్తున్నాడు అన్నట్టుగా చూశారు. కానీ మొత్తానికి వాళ్ళు సలార్ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత స్కూల్లో అది చూసిన ఆయన ఫ్రెండ్స్ మొత్తం తనని హీరోగా చూశారు అంటూ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి తను సినిమాలో నటించడం వల్ల స్కూల్లో హీరో అయ్యాడని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో కార్తికేయ కి చాలా మంచి పేరు వచ్చింది.
ఇక ఇప్పుడైనా వరుసగా చాలా సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక తను ఫ్యూచర్ లో సినిమా ఇండస్ట్రీలోనే హీరోగా సెట్ అవ్వాలని చూస్తున్నాడు. మొన్నటి వరకు ఇమేజ్ లేని తనకి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి… ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహం తో ఆయనకి బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పాడు…