Salaar Vs Dunki: పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఈ రోజు సలార్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా టికెట్లు బుక్ మై షో లో పెట్టిన గంటలోనే మొత్తం టికెట్లు అమ్ముడు పోయి హౌజ్ ఫుల్ అయిపోయాయి. ఇక ప్రపంచ వ్యాప్తం గా ఒకే రోజు 30 లక్షల టికెట్లు బుక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు…
అయితే ఇలాంటి సినిమాకి పోటీగా షారుఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన డంకి సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా నిన్న రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా కంటెంట్ పరంగా చాలా వీక్ గా ఉండడంతో నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇంకా దానితో ఈరోజు రిలీజ్ అయిన సలార్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుడి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక దీని వల్లే షారుఖ్ ఖాన్ సినిమా అయిన డంకి ని బీట్ చేస్తూ సలార్ ముందుకు వెళ్తుంది.ఇక రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన గత చిత్రాలతో పోలిస్తే చాలావరకు తగ్గిందనే చెప్తున్నారు. కుమార్ హీరాని అంటే కంటెంట్ లో దమ్ము ఉంటుంది. కానీ డంకి సినిమాలో అది మిస్ అయిందని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: సలార్ సీజ్ ఫైర్ మూవీ ఫుల్ రివ్యూ… హిట్టా? ఫట్టా?
పఠాన్, జవాన్ లాంటి వరుస హిట్లు కొట్టిన షారుక్ ఖాన్ డంకి సినిమా తో ప్రభాస్ సలార్ సినిమాను బీట్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. వాళ్లు అలా అనుకోవడం లో తపు కూడా లేదు ఎందుకంటే డంకి సినిమా డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ మీద ఉన్న గుడ్ నేమ్ అలాంటిది. కానీ ఇప్పుడు అంచనాలు మొత్తం తారుమారు అయిపోయాయి. ఇక ప్రభాస్ సలార్ సినిమాతో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కి కలెక్షన్స్ కూడా డంకి కంటే చాలా ఎక్కువ గా వస్తున్నాయి.
రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో కలక్షన్స్ పరంగా ఈ సినిమానే చాలా వీక్ అని ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు…ఇక ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గుర్తింపు పొందిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాతో నిరాశపరచడం అతని ఫ్యాన్స్ కి చాలా భాద ని కలిగిస్తుంది…ఇక ఇది ఇక ఉంటే సలార్ సినిమాతో ప్రభాస్ మళ్లీ సక్సెస్ బాట పట్టడం అనేది అతని అభిమానులకి సంతోషాన్ని ఇచ్చే విషయం అనే చెప్పాలి…
Also Read: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే!