Salaar : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘సలార్'(Salaar Movie) చిత్రం 2023 వ సంవత్సరంలో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది అనేది మన అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా రూపం లో భారీ హిట్ అందింది. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రంతో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించాడు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కువగా ‘సలార్’ చిత్రం అంటేనే ఎక్కువ ఇష్టం. మామూలు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. ముఖ్యంగా ఓటీటీ లో యూత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా చూసారు. నార్త్ ఇండియా లో ఈ చిత్రం బాగానే ఆడింది కానీ, కల్కి రేంజ్ వసూళ్లను రాబట్టలేదు.
Also Read : గంటకు 3 వేల టిక్కెట్లు..రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో చరిత్ర సృష్టిస్తున్న ‘సలార్’.
కానీ డిస్నీ + హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ విడుదల అయ్యాక దాదాపుగా ఏడాది నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం జరగలేదు. అలాంటి క్రేజ్ ని దక్కించుకున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మూడు రోజుల క్రితం బుక్ మై షో లో షెడ్యూల్ చేసారు. టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఈ మూడు రోజుల్లో బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్ లో కలిపి దాదాపుగా 50 వేల టికెట్స్ సేల్ అయ్యాయి అట. అందుకు గాను దాదాపుగా కోటి రూపాయిల గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ ద్వారా వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. అలా జరిగిన రోజున కచ్చితంగా ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ‘సలార్’ చిత్రం రెండు సార్లు లిమిటెడ్ షోస్ తో విడుదలైంది. రెస్పాన్స్ సరిగా రాలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఊపుని చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లను బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. గబ్బర్ సింగ్ చిత్రం మొదటి రోజున 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. కానీ ‘సలార్’ చిత్రానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సీడెడ్ మరియు ఓవర్సీస్ ప్రాంతాల్లో ‘గబ్బర్ సింగ్’ ని కొట్టడం కష్టమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో అనేది.
Also Read : ‘సలార్ 2’ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ లో చూపించబోతున్నాడా..?