MLC Kavitha: తెలంగాణలో ఓ మోటు సామెత ఉంటుంది. ‘దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు’ అని.. ఎవరైనా పాత విషయాన్ని కొత్తగా ప్రస్తావించినప్పుడు ఈ సామెత వేస్తారు. తాజాగా బీఆర్‌ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీరు అలాగే ఉంది. తెలంగాణ రాష్ట్ర గీతం అంశాన్ని ఆమె శాసన మండలిలో తాజాగా ప్రశ్నించారు.
Also Read: వైసీపీలో అధినేత మనసులో.. జనసేనలో ద్వితీయ శ్రేణి నేతలతో.. మాజీ మంత్రిపై వీడియో వైరల్!
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ‘(Jaya Jayahe Telangana)కు సంగీత దర్శకుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM.Keravani) సంగీతం అందించారు. ఈ గీతం అమలులోకి వచ్చి ఏడాది కావస్తోంది. దీనిపై అప్పట్లోనే చర్చ జరిగింది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెలీస, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కవిత శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కీరవాని సంగీతం అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం(మార్చి 15న) జరిగిన చర్చలో ‘తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవరికీ అర్థం కాని విషయం. రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చడానికి తెలంగాణలో కళాకారులు లేరా?‘ అని ప్రశ్నించారు. కవిత మాటల్లో, కీరవాణి పట్ల తమకు పూర్తి గౌరవం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర గీతం అనేది రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీక కాబట్టి, దానికి స్థానిక సంగీత దర్శకుడికి అవకాశం ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా(Social media)లో కూడా చర్చనీయాంశంగా మారాయి. కొందు కవిత ప్రశ్నను సమర్థిస్తుండగా, మరికొందరు కీరవాణ వంటి అంతర్జాతీయ ఖ్యాతి గల సంగీత దర్శకుడు ఈ బాధ్యత తీసుకోవడం సముచితమని పేర్కొంటున్నారు. సంగీతానికి , కళలకు కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవని సూచిస్తున్నారు.
2024లో అధికారిక ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వం 2024లో ‘జయ జయ హే తెలంగాణ‘ను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ గీతాన్ని తెలంగాణ ఉద్యమకారుడు. కవి అందె శ్రీ(Ande Sri)రచించగా, దీనికి సంగీతాన్ని అందించేందుకు కీరవాణిని ఎంపిక చేశారు. కీరవాణి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాల అనుభవం మరియు ‘బాహుబలి‘, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలకు సంగీతం అందించి ఆస్కార్(Askar) వంటి అంతర్జాతీయ అవార్డులు సాధించిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ, కవిత తన వాదనలో రాష్ట్ర గీతం తెలంగాణ సంస్కృతి, గుర్తింపును ప్రతిబింబించాలని, అందుకు స్థానిక కళాకారులు ఉండగా బయటి వ్యక్తిని ఎంచుకోవడం సరికాదని పేర్కొన్నారు.
నాడు తిహార్ జైల్లో కవిత..
తెలంగాణ రాష్ట్ర గీతం ప్రకటించిన సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైల్లో (Tihar Jail)ఉన్నారు. అయితే అప్పుడు కొందరు బీఆర్‌ఎస్ నేతలు కీరవాణి సంగీతం అందించడంపై అభ్యంతరం తెలిపారు. కానీ, సంగీతానికి ఎల్లలు లేవు అన్న ఉద్దేశంతోనే ఆయనకు సంగీతం అందించే బాధ్యతను అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం తెలియని కవిత. పాత విషయాన్నే మరోమారు మండలిలో ప్రస్తావించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలు అనేకం ఉండగా, కేవలం ప్రాంతీయ విభేదాలు, తెలంగాణ వాదంతో పబ్బం గడుపుకోవడానికి కవిత మరోమారు తెలంగాణ గీతం, సంగీతం అంశాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.